E-Paper
Advertisement

Bengaluru: నేను తప్పు చేశాను.. తల్లికి లేఖ రాసిన బెంగుళూరు టీచర్, చివరకు ఏం జరిగింది?

Bengaluru: నేను తప్పు చేశాను.. తల్లికి లేఖ రాసిన బెంగుళూరు టీచర్, చివరకు ఏం జరిగింది?
Advertisement

Bengaluru: ప్రేమించుకుంటున్నారు.. ఆ తర్వాత వివాహం చేసుకుంటున్నారు. ఏరి కోరి పెళ్లి చేసుకున్నవాళ్లు, రకరకాల కారణాల వల్ల ఈ లోకాన్ని విడిచి పెడుతున్నారు. తాజాగా బెంగుళూరులో అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు, తన ఇంట్లో శవమై కనిపించింది. అసలేం జరిగింది?

బెంగుళూరులో దారుణం-కర్ణాటకలోని చిక్కమంగళూరుకు చెందిన 25 ఏళ్ల శ్వేత ఓ వ్యక్తిని ప్రేమించింది. అతడ్ని వివాహం చేసుకుంటానని పేరెంట్స్‌కి చెప్పింది. అందుకు ససేమిరా అన్నారు.  నాలుగు నెలల కిందట కోరుకున్న ప్రియుడ్ని వివాహం చేసుకుంది. బెంగుళూరు సిటీలోని ప్రైవేటు స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి సుంకదకట్టెలోని బాడుగ ప్రాంతంలో ఉంటోంది.

Advertisement

ప్రేమించిన పెళ్లి చేసుకున్న టీచర్ సూసైడ్- భార్యభర్తల మధ్య ఏం జరిగిందో తెలీదు.  సోమవారం ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయింది. ఈ క్రమంలో సూసైడ్ లేఖ రాసింది. వారిద్దరు ఇష్టమైన రీతిలో బతికేందుకు అవకాశం లేకుండా చేశారు.. నేను చనిపోతున్నాను.. వారిద్దరినీ విడిచి పెట్టవద్దని అందులో రాసుంది. అమ్మా.. నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు అంటూ తన తల్లిని ఉద్దేశించి లేఖలో పేర్కొంది శ్వేత.

శ్వేత-మూర్తి లవ్ మ్యారేజ్ – తన ఆత్మహత్యకు తన భర్త, ఆమె సోదరి కారణమని ప్రధానంగా ప్రస్తావించింది. కట్నం కోసం భర్త, అతని సోదరి ఆమెను వేధిస్తున్నారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. చిక్కమంగళూరు జిల్లా కడూరు తాలూకాకు చెందిన శ్వేత తొలుత ఓ వస్త్ర కర్మాగారంలో పని చేసేది. ఆ తర్వాత పాఠశాల విద్యార్థులకు ట్యూషన్ చెప్పేది.

Advertisement

ఇటీవల బెంగుళూరు సిటీలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా చేరింది. అసలు శ్వేత ఎలా ప్రేమించింది? ఏడాదిన్నర కిందట తీర్థ యాత్ర సందర్భంగా రైలులో శ్వేతకు ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడు పేరు మూర్తి, వయస్సు 27 ఏళ్లు. ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో పని చేస్తున్నాడు. ఆ తర్వాత ఫోన్ నంబర్లు మార్చుకున్నారు, నిరంతరం మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు.

శ్వేత సూసైడ్ నోట్‌లో కీలక అంశాలు-నాలుగు నెలల కిందట వివాహం చేసుకున్నారు. ఆ జంట అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. పెళ్లి సమయంలో తాము కట్నం ఇవ్వలేమని శ్వేత తల్లి చెప్పింది. అందుకు సరేనని చెప్పింది మూర్తి కుటుంబం. శ్వేత నివాసానికి సమీపంలో మూర్తి అక్క నరసమ్మ ఉంటుంది. తరచుగా శ్వేత ఇంటికి వచ్చి మరింత కట్నం తీసుకురావాలని వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ALSO READ: ఢిల్లీలో అర్ధరాత్రి దారుణం.. భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన పోలీస్ భర్త 

మూర్తి తన సోదరికి మాట మీద ఉండడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆదివారం ఈ దంపతుల మధ్య మరోసారి వాగ్వాదం జరిగినట్లు తెలిపారు పోలీసులు. తాను పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది శ్వేత. ఆ తర్వాత తన తల్లితో మాట్లాడి మధ్యాహ్నం 2 గంటలకు ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంటి యజమాని నుంచి అదనపు తాళం కీ ని తీసుకుంది.

ఆమె భర్త మూర్తి ఇంటికి వచ్చినప్పుడు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. తన సోదరితో మాట్లాడటానికి శ్వేత తనను అనుమతించలేదని మూర్తి ఆరోపించాడు. మూర్తి తండ్రికి ఇద్దరు భార్యలు. నరసమ్మ మొదటి భార్య కాగా, మూర్తి.. రెండో భార్య కొడుకు. తల్లిదండ్రులు మరణించిన తర్వాత నరసమ్మ మూర్తిని పెంచింది. ప్రస్తుతం శ్వేత భర్త, అతడి సోదరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Related News

ఢిల్లీలో అర్ధరాత్రి దారుణం.. భార్యను నడిరోడ్డుపై కాల్చి చంపిన పోలీస్ భర్త

సీఎం విజయ్ కొత్త రూల్.. రోగి మరణిస్తే ఫీజు మాఫీ? ఆస్పత్రుల గుండెల్లో రైళ్లు!

బంగాళాఖాతంలో పడవ బోల్తా.. 9 మంది మత్స్యకారులు మృతి, ఆరుగురి గల్లంతు!

ఐసీయూలో కన్నతల్లి.. తల్లడిల్లిన జొమాటో బాయ్.. కస్టమర్ చేసిన పనికి నెట్టింట ప్రశంసలు!

అస్సాంలో డ్రగ్స్ వేట.. రూ.472 కోట్ల మత్తు సామ్రాజ్యాన్ని తొక్కిపారేసిన సీఎం!

Election Commission: ఈసీ కీలక ప్రకటన.. పేరెంట్స్ వివరాలు అందుకే, కొత్త ఓటర్ల నమోదుపై క్లారిటీ

ట్విస్ట్ అంటే ఇది.. పెన్షన్ డబ్బుల కోసం వెళ్తే.. అకౌంట్లో రూ.759 కోట్లు! చూసి షాకైన వృద్ధుడు

Big Stories

Advertisement
×