E-Paper
Advertisement

Actress Dhanush : ధనుష్ జీవితంలో ట్విస్ట్.. భార్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!

Actress Dhanush : ధనుష్ జీవితంలో ట్విస్ట్.. భార్య చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే..!
Advertisement

Actress Dhanush : బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో నటిస్తున్న హీరోల గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈమధ్య సినిమా హీరోల కన్నా కూడా సీరియల్ హీరోలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ప్రతిరోజు టీవీలలో కనిపించే వీళ్ళ కోసం జనాలు ఎంతో అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈమధ్య సీరియల్ హీరోలు హీరోయిన్ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తూ ఉంటారు.. బుల్లితెరపై హీరోగా పలు సీరియల్స్ లో నటించిన జై ధనుష్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. అతని గురించి ఓ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవడంతో జనాలు అతని భార్య కీర్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఆమె మనసు చాలా గొప్పది అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.. అసలు ఏం జరిగింది? ఆ వీడియోలో ఏముంది? వీడియో పై వస్తున్న కామెంట్లు ఏంటి అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. ఈ మ్యాటర్ఏంటో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ధనుష్ భార్య ఎంతైన గ్రేట్ కదా..

బుల్లితెర పై హీరోగా నటిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో ఈయన తెలుగులో అనేక సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.. ప్రస్తుతం కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ హీరో గురించి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఏముందంటే ధనుష్ కి ఆల్రెడీ వేరే ఆవిడతో పెళ్లయి పెళ్లీడుకొచ్చిన పాప కూడా ఉంది అని కనిపిస్తుంది.. సీరియల్ నటి కీర్తిని ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న కూడా ఆమె కూతుర్ని మాత్రం కీర్తి తన సొంత కూతురు లాగా చూసుకోవడం ఆ వీడియోలో కనిపిస్తుంది.. ప్రస్తుతం వీళ్ళ ఫ్యామిలీ గురించి ఎన్నో రీల్స్ బయటికి వచ్చాయి.. సవతి కూతురు అని కూడా ఎక్కడా చూడకుండా కీర్తి తన కూతురుతో కలిసి డాన్స్ చేస్తూ చాలా సంతోషంగా కనిపిస్తుంది.. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. నిజంగా నీలాంటి భార్య ధనుష్కి దొరకడం గ్రేట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తన కూతురిలాగే తన భర్త మొదటి భార్య కూతుర్ని కూడా చూసుకోవడం మామూలు విషయం కాదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. మరి ఈ వార్తలు పై ధనుష్ కీర్తి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

Advertisement

?igsh=dmtyeWZ0dzNrcDJy

ధనుష్, కీర్తి పర్సనల్ విషయానికొస్తే..

ఇద్దరు కూడా సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉండేవారు.. అయితే రంగం అనే డాన్స్ షో ద్వారా వీళ్ళిద్దరూ పార్టనర్స్ గా చేశారు.. అలా ఎన్నో ఎపిసోడ్లు చేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు.. ఇద్దరు కలిసి తమ ప్రేమని పెళ్లి వరకు తీసుకొని వెళ్లాలని అనుకున్నారు.. ధనుష్ కి ఆల్రెడీ పెళ్లి అవ్వడంతో మొదట కీర్తి వల్ల పేరెంట్ వద్దని అనుకున్నారట. అయితే వీళ్ళిద్దరూ తమ పేరెంట్స్ కి నచ్చచెప్పి చివరికి పెళ్లి పీటల వరకు తీసుకొని వెళ్లి పెళ్లి చేసుకున్నారు.. 2015 లో వీరిద్దరి పెళ్లయింది.. వీరిద్దరి దాంపత్యానికి గుర్తుగా ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే మొదటి భార్యతో మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్న ధనుష్ తన కూతురిని తనతోని ఉంచుకున్నారు.. ఆమెను ధనుష్ చదివిస్తున్నాడు. అంతే కాదు కీర్తిని అమ్మాయిని కూడా ఆ అమ్మాయి పిలుస్తున్నట్లు తెలుస్తుంది.. కీర్తి ధనుష్ మొదటి భార్య కూతురితో చేసిన కొన్ని డాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఏది ఏమైనా కూడా కీర్తి ఆ అమ్మాయిని కూడా తన సొంత బిడ్డ లాగా చూసుకోవడం గ్రేట్ అంటూ కొందరు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ఇకపోతే కీర్తి ఈమధ్య సీరియల్స్ కి దూరంగా ఉంటుంది.. ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తున్న కీర్తి తన పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుంది.. ధనుష్ మాత్రం బుల్లితెరపై ప్రసారమవుతున్న కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్లో హీరోగా నటిస్తున్నాడు..

Advertisement

Also Read :ఇంద్రజకు ఘోర అవమానం.. పిలిచి మరీ అవమానిస్తారా? ఫైమాపై సీరియస్..

Related News

Intinti Ramayanam Today Episode: అవని జైలుకేనా..? పల్లవిని కొట్టిన కమల్.. అవనిని కొట్టిన పోలీసులు..

Karthika Deepam 2 Serial Today Episode October 15th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న చనిపోయిందన్న ఎస్సై – అయోమయంలో సూరజ్‌          

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు కోసం కన్నీళ్లు.. భద్రకు తల్లి వార్నింగ్.. వల్లికి, భాగ్యంకు దిమ్మతిరిగే షాక్..

Illu Illaalu Pillalu : రామరాజు అరెస్ట్.. స్టోరీలో ఊహించని ట్విస్ట్.. శ్రీవల్లి అవుట్..

Brahmamudi Serial Today Episode October 15th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సొంత ఆఫీసుకు వెళ్తూ రేఖకు షాక్‌ ఇచ్చిన ఐశ్వర్య

Thursday TV Movies : గురువారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 15th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: వైజయంతికి మనోహరి గురించి సరస్వతి నిజం చెప్తుందా..?  

బతుకమ్మ వేడుకల్లో లయ అందాల సందడి.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×