E-Paper
Advertisement

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన

ప్రియురాల్ని చంపిన టెక్కీ.. రాత్రంతా మృతదేహం పక్కనే, ఆ తర్వాత ఏం చేశాడంటే, పూణెలో షాకింగ్ ఘటన
Advertisement

Techie Killed Girlfriend: వారిద్దరు స్టాఫ్‌వేర్ ఇంజనీర్లు.. గడిచిన కొన్నాళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. రేపో మాపో వివాహం చేయాలని డిసైడ్ అయ్యారు. టెక్కీల మధ్య ఏం జరిగిందో తెలీదు. ప్రియురాల్ని అత్యంత దారుణంగా చంపేశాడు ప్రియుడు. సంచలనం రేపిన ఈ ఘటన పూణెలో వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగింది?

పూణెలో షాకింగ్ ఘటన

మహారాష్ట్రలోని పూణె సిటీ గురించి చెప్పనక్కర్లేదు.  ఐటీకి కేరాఫ్‌గా హింజవాడి ప్రాంతాన్ని చెబుతారు. శుభం జ్ఞానేశ్వర్ కల్బండే- కోమల్ దహకే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. హింజవాడిలోని దేశీయ ఐటీ కంపెనీలో వీరిద్దరు పని చేస్తున్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. వారి కుటుంబాలు కూడా పిల్లల ఇష్టాలను గౌరవించారు. ఆ తర్వాత ఇద్దరు సహజీవనం మొదలుపెట్టారు.

Advertisement

అంతా బాగానే సాగుతున్న సమయంలో చిన్న అనుమానం పెను భూతమైంది. ఆ తర్వాత ఒకరిపై మరొకరికి అనుమానాలు పెరిగాయి. కూర్చుని సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. అనుమానం కాస్త తారాస్థాయికి చేరింది. శుభమ్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కోమల్ అనుమానించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచుగా చిన్న చిన్న గొడవలు జరిగేవి.

ప్రియురాల్ని చంపిన టెక్కీ ప్రియుడు

ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య ఏదో విషయంపై వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన శుభమ్.. కోమల్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ఈ లోకాన్ని విడిచి పెట్టింది. శుభం.. తన ప్రియురాలు కోమల్ తల, మెడపై కాళ్లతో తన్ని దాడి చేశాడని ఆరోపణలు ఉన్నాయి. తీవ్ర గాయాలతో ఆమె స్పృహ కోల్పోయి మరణించింది. మొత్తం ఘటనలో అత్యంత దిగ్భ్రాంతి కరమైన విషయం ఏమిటంటే.. కోమల్ మరణించిన తర్వాత నిందితుడు శుభం రాత్రంతా మృతదేహం పక్కనే కూర్చుని ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం శుభమ్ స్వయంగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి.. ప్రియురాలిని తాను హత్య చేసినట్లు చెప్పాడు.

Advertisement

ALSO READ: త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

సమాచారం అందుకున్న వెంటనే హింజవాడి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ గదిలో భయంకరమైన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాకయ్యారు. కోమల్ అపస్మారక స్థితిలో ఉండగా, పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. నిందితుడు శుభం జ్ఞానేశ్వర్ కల్బండేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు హత్య చేశాడు? అనేది ఇంకా తెలియాల్సివుంది.

Related News

త్వరలో మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే..?

‘బాహుబలిలా ప్రవర్తించడం ఆపండి’.. బిహార్ సెషన్స్ జడ్జిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

Big Stories

Advertisement
×