E-Paper
Advertisement

Maruti Suzuki: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!

Maruti Suzuki: కొనుగోలుదారులకు మారుతి షాక్.. మళ్లీ పెరిగిన కార్ల ధరలు!
Advertisement

Maruti Suzuki Price Hike 2026: మారుతి సుజుకి కార్లు కొనాలనుకునే వారికి కంపెనీ షాకింగ్ న్యూస్ చెప్పింది. 2026లో ఇప్పటికే మూడుసార్లు ధరలను సవరించిన కంపెనీ.. తాజాగా నాలుగోసారి కూడా ధరలను పెంచింది. ఈ కొత్త ధరలు నవంబర్ 22 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే, అన్ని కార్ల ధరలు ఒకేలా పెరగలేదు. మోడల్, వేరియంట్‌ను బట్టి ధరలు పెరిగాయి.

సగటున 0.31 శాతం పెరిగిన ధరలు

మారుతి సుజుకి తాజా ధరల పెంపు సగటున 0.31 శాతంగా ఉంది. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రొడక్షన్ ఖర్చులను కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టినప్పటికీ, ఖర్చులు పెరుగుతూనే ఉండటంతో కొంత భారాన్ని కొనుగోలుదారులపై వేయాల్సి వచ్చిందని తెలిపింది. అయితే, ఏయే మోడళ్లపై ఎంత ధర పెరిగిందనే వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు ధరల పెంపు

Advertisement

2026లో మారుతి సుజుకి ధరలను పెంచడం ఇది నాలుగోసారి. అంతకుముందు జూన్‌లో రూ.30,000 వరకు, ఆగస్టులో మరోసారి రూ.30,000 వరకు, సెప్టెంబర్‌లో గరిష్ఠంగా రూ.20,000 వరకు ధరలను పెంచింది. ఈ మూడు పెంపులు కలిపి ఒక శాతానికి పైగా ఉన్నాయి. తాజాగా నవంబర్‌లో మరో 0.31 శాతం పెంపును అమల్లోకి తీసుకొచ్చింది. అయితే, 2027 మార్చి నాటికి మళ్లీ ధరలు పెంపు ఉండే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముడిసరుకుల ధరలు, తయారీ ఖర్చుల్లో వచ్చే మార్పులను బట్టి తర్వాతి సవరణ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

అమ్మకాలు పెరిగినా తగ్గిన కంపెనీ లాభాలు

అటు మారుతి సుజుకి అమ్మకాల పరంగా మంచి రిజల్ట్స్ సాధిస్తోంది.  ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏకంగా 6,96,654 కార్లను అమ్మింది. కంపెనీ చరిత్రలో ఇవే అత్యధిక అమ్మకాలు కావడం విశేషం. అయితే, అమ్మకాలు పెరిగినప్పటికీ లాభాలు మాత్రం తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 26.36 శాతం పడిపోయి రూ.2,466.1 కోట్లకు చేరింది. లాభాల మార్జిన్ కూడా 12.7 శాతం నుంచి 9.4 శాతానికి తగ్గింది.

ముడిసరుకుల ఖర్చులే అసలు సమస్య

Advertisement

మారుతి అమ్మకాలలో ముడిసరుకుల ఖర్చుల వాటా గత ఏడాది 75.7 శాతంగా ఉండగా, ప్రస్తుతం 79.9 శాతానికి చేరింది. ముఖ్యంగా స్టీల్, కాపర్ ధరలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ, మార్కెట్లో కార్లకు డిమాండ్ బలంగానే ఉంది. చిన్న కార్ల అమ్మకాలు 35.9 శాతం, ఎస్‌యూవీ విక్రయాలు 68.2 శాతం పెరిగాయి. 2026 సెప్టెంబర్ చివరి నాటికి సుమారు 2 లక్షల కార్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న నెలల్లో మారుతి ధరలను మరోసారి పెంచుతుందా? అనేది ప్రశ్న తలెత్తుతోంది.

Read Also: విన్‌ఫాస్ట్ నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే?

Tags

Related News

ఒకే రోజులో రెండుసార్లు ట్రాఫిక్ చలాన్ పడుతుందా? వాహనదారులు ఈ రూల్స్ తెలుసుకోండి

క్యూట్ లుక్‌ తో కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ ఎంతో తెలిస్తే షాకవ్వల్సిందే!

విన్‌ఫాస్ట్ నుంచి మూడు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. లాంచింగ్ ఎప్పుడంటే?

టాటా To హోండా.. డిసెంబర్‌ లో రాబోతున్న 5 అదిరిపోయే కార్లు ఇవే!

ఎలక్ట్రిక్ నుంచి CNG వరకు.. డిసెంబర్‌ లో మార్కెట్లో అడుగు పెట్టనున్న 10 క్రేజీ స్కూటర్లు!

BYDకి భారీ షాక్.. Ti7 SUV అమ్మకాలపై కోర్టు నిషేధం! JLR ఎందుకు కేసు వేసిందంటే?

రోజూ ఆఫీస్ వెళ్లేందుకు మంచి స్కూటీ కొనాలనుకుంటున్నారా? మంచి మైలేజీ ఇచ్చే బెస్ట్ మోడల్స్ ఇవే

Big Stories

Advertisement
×