E-Paper
Advertisement

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!

రూ. 2 కోట్ల నోట్ల దండలు.. వరులకు బావమరిది బంపర్ గిఫ్ట్.. వీడియో వైరల్!
Advertisement

UP Wedding Viral Video: సాధారణంగా ప్రతీ పెళ్లిలో వరుడు, వధువు మెడలో పూల దండలు వేస్తుంటారు. కానీ యూపీలో జరిగిన ఓ పెళ్లి ఊరేగింపు కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఇద్దరు వరుల మెడలో 200 అడుగులు పొడవైన రూ.500 నోట్ల దండలు వేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్కో దండ విలువ రూ.1 కోటి వరకు ఉంటుందని సమాచారం. ఇందుకు సంబంధించి దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.

వివరాల్లోకి వెళ్తే..

యూపీలోని నాగ్లా ఫౌడా గ్రామానికి చెందిన వరులు ప్రశాంత్ సింగ్, కన్హా సింగ్‌లకు ఈ ఖరీదైన దండలు వేశారు. వీరిద్దరూ కజిన్స్ కాగా.. రాజస్థాన్‌  నందోలి గ్రామానికి చెందిన వీరి బావమరిది యోగేశ్ కుమార్ ఠాకూర్ ఈ దండలు వారికి వేశారు. పెళ్లి వేడుకను అత్యంత వైభవంగా మార్చాలని ఉద్దేశంతో ఇద్దరికీ చెరో రూ.కోటి విలువైన డబ్బుల దండలను బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది.

రూ.500 నోట్లతో పొడవైన దండలు

Advertisement

కాగా దాదాపు 200 అడుగుల పొడవు ఉన్న ఈ దండను రూ.500 నోట్లతో పేర్చారు. ఇవి భారీగా ఉండటంతో వాటిని వేసుకొని వరులు అతికష్టం మీద ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ దండలు పట్టుకోవడానికి, మోయడానికి బంధువులు సాయం చేశారు. వైరల్ దృశ్యాలను గమనిస్తే.. వరులు ఇంటి మేడ పైన నిలబడగా.. దండ మాత్రం రోడ్డు మీద వరకూ వ్యాపించి ఉంది. అయితే బహుమతిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అలాంటి బావమరిది దొరికినందుకు ఇద్దరు పెళ్లి కొడుకులు చాలా లక్కీ అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Also Read: ప్లేట్లు కడిగే కుర్రాడు… కట్ చేస్తే ప్రపంచాన్నే ఏలిన చెఫ్… ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ బయోపిక్

ఇద్దరు వరులు ఏం చేస్తారంటే?

వరులు ప్రశాంత్ సింగ్, కన్హా సింగ్ విషయానికి వస్తే.. వీరిద్దరు భారతీయ కిసాన్ యూనియన్ కు చెందిన రైతు నేత మహావీర్ స్వామి మేనల్లుళ్లు. వీరి కుటుంబాలు మార్బుల్, స్టోన్ షోరూమ్ వ్యాపారంలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ వైరల్ వీడియోపై ప్రశంసలతో పాటు విమర్శలు సైతం వస్తున్నాయి. కొందరు నెటిజన్లు దీనిపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కోటీశ్వరులమని నలుగిరికి డప్పు కొట్టుకోవడం కోసమే నోట్ల దండను ఏర్పాటు చేశారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

Tags

Related News

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

నాడు రూ.300 పెట్టుబడి.. నేడు వేల కోట్ల అధిపతి.. రజినీ బెక్టర్ వ్యాపార విజయ ప్రస్థానం ఇదే!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

Big Stories

Advertisement
×