E-Paper
Advertisement

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?
Advertisement

Gold jewellery Recovery: ఈ రోజుల్లో ఒక్క రూపాయి పోగొట్టుకున్నా అది తిరిగి చేతికి రావడం అసాధ్యం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా రూ.55 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును చేజార్చుకొని తిరిగి దక్కించుకున్నాడు. ఢిల్లీలో కాశ్మీరీ గేట్ బస్ టెర్మినల్ లో పొరపాటున చేతులు మారిన బ్యాగ్ ను బెంగళూరులో రాజధాని పోలీసులు రికవరీ చేశారు. నవంబర్ 12న అమృత్ రాజ్ కు ఎదురైన ఈ ఆశ్చర్యకర ఘటన ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అంతకుముందు అమృత్ రాజ్ వర్మ.. ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్ ప్రవేశ ద్వారం వద్ద లగేజీ చెకింగ్ మిషన్ దగ్గర తన బ్యాగ్ పోయిందని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బ్యాగులో బట్టలు, రూ.9,000 నగదు, మొబైల్ ఛార్జర్, ఆధార్ కార్డుతో పాటు దాదాపు రూ.55 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని పోలీసులకు తెలిపారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పొరపాటున జరిగిన బ్యాగులు మారిపోవడం వల్ల అది మరో వ్యక్తి చేతికి చేరినట్లు గుర్తించారు.

Advertisement

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బ్యాగును తీసుకున్న వ్యక్తిని అధికారులు ట్రాక్ చేశారు. అతడు బెంగళూరు బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బ్యాగు పోయిన 6 రోజుల తర్వాత అంటే నవంబర్ 18న బెంగళూరులో అనుమాతుడి ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్‌కు చెందిన ఆ వ్యక్తి.. బెంగళూరులోని ఒక రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. పొరపాటున వేరే బ్యాగ్ తన చేతికి వచ్చిందని తెలిసిన వెంటనే అతడు పోలీసు కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు కూడా అధికారులు కనుగొన్నారు.

Also Read: Illu Illalu Pillalu Today Episodes: గుడ్ న్యూస్ చెప్పిన శ్రీవల్లి.. ధీరజ్ ఫుల్ హ్యాపీ.. దీపావళి సంబరాలు షురూ..

Advertisement

పోలీసులకు సమాచారం ఇవ్వడమే కాకుండా అందులోని వస్తువులను భద్రంగా సదరు చెఫ్ దాచిపెట్టాడు. పోలీసులు అతడి ఆచూకీ గుర్తించి చేరుకోగానే.. బ్యాగును వారికి ఇచ్చేశాడు. అందులోని బంగారం, నగదు ఏమాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉండటంతో అతడి నిజాయితీకి పోలీసులు సైతం ముగ్దులయ్యారు. అతడిని ప్రశంసించారు. అనంతరం అమృత్ రాజ్ చెంతకు బ్యాగును చేర్చడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ ఘటన నెట్టింట వైరల్ కావడంతో అదృష్టం ఈయనదే అంటూ పలువురు అమృత్ రాజ్ ను అభినందిస్తున్నారు.

Also Read: ఏపీలో కొత్త అధ్యాయం.. నేడే కొత్త పాలకవర్గాల ప్రమాణ స్వీకారం.. పట్టణాల్లో పండగ వాతావరణం!

Tags

Related News

నాడు రూ.300 పెట్టుబడి.. నేడు వేల కోట్ల అధిపతి.. రజినీ బెక్టర్ వ్యాపార విజయ ప్రస్థానం ఇదే!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

పోలీస్ వరుడి కట్నం కక్కుర్తి.. బ్రెజ్జా కారు లేదని పెళ్లి క్యాన్సిల్.. మండపం నుంచి యూటర్న్!

కాంగ్రెస్‌లో సిరాజ్ చిచ్చు.. సొంత పార్టీ నేతకే.. ఎంపీ ముంతాజ్ పటేల్ చురకలు!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్మీ కుటుంబాలకు చెందిన ఏడుగురి దుర్మరణం

Big Stories

Advertisement
×