E-Paper
Advertisement

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!

యూపీలో సీట్ల కుస్తీ.. కాంగ్రెస్, ఎస్పీ మధ్య తేలని పొత్తు లెక్కలు.. ఢిల్లీలో 15 నిమిషాలకే ముగిసిన భేటి!
Advertisement

UP Elections 2027: రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని యోగీ ప్రభుత్వాన్ని ఈసారి ఎలాగైనా ఓడించాలని విపక్ష కాంగ్రెస్ తోపాటు పాటు సమాజ్ వాదీ పార్టీ దృఢ సంకల్పంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే పొత్తు సైతం పెట్టుకున్నాయి. అయితే సీట్ల సర్దుబాటు అంశం ప్రస్తుతం రెండు పార్టీలకు ఇబ్బందిగా మారుతోంది. దీనిపై చర్చించేందుకు తొలిదశలో భాగంగా ఢిల్లీలో ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. అయితే కేవలం 15 నిమిషాల్లోనే ఈ భేటి ముగియడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మూడ్రోజుల్లో చర్చలు కొలిక్కి..

కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ఇరు పార్టీల నుంచి నలుగురు చొప్పున నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ తరపున ఆ పార్టీ యూపీ ఇన్‌ఛార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్, రాష్ట్ర అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్, శాసనసభా పక్ష నేత వీరేంద్ర చౌదరి పాల్గొన్నారు. అటు ఎస్పీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు శ్యామ్‌లాల్ పాల్, ఎంపీలు రాజీవ్ రాయ్, ఇక్రా హసన్ పాల్గొని చర్చించారు. ఇరు పార్టీల నేతలు ఎంతో సానుకూల వాతావరణంలో సమావేశమయ్యారని రానున్న 2-3 రోజుల్లో సీట్ల సర్దుబాటు చర్చలు కొలిక్కి వస్తాయని యూపీ కాంగ్రెస్ చీఫ్ ఆరాధన మిశ్రా తెలిపారు.

100కు పైగా సీట్లపై కాంగ్రెస్ కన్ను

Advertisement

యూపీ ఎన్నికల్లో తమ కూటమికి బలంగా ఉన్న కనీసం 60 ఏ-గ్రేడ్ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎస్పీ తమకు 40 నుంచి 45 సీట్లు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి ఓవరాల్ గా 100పైగా సీట్లలో పోటీ చేసేలా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. 2017లో పొత్తు సందర్భంగా ఎస్పీ దాదాపు 105 సీట్లు కేటాయించినందున ఈసారి కూడా 100 సీట్ల మార్కును అందుకోవాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.

ఎక్కువ సీట్లు కోరడంపై కాంగ్రెస్ వాదన

తమకు సీట్ల సంఖ్యతో పాటు గెలుపు అవకాశాలు కూడా ముఖ్యమని చర్చల్లో పాల్గొన్న ఓ కాంగ్రెస్ నేత తెలిపారు. యాదవేతర, ముస్లిమేతర ఓటర్లను.. ముఖ్యంగా దళితులు, బ్రాహ్మణులు, అత్యంత వెనుకబడిన తరగతులను ఆకర్షించడానికి గెలిచే సీట్లతో పాటు గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు అవసరమని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే అత్యుత్సాహంతో కాంగ్రెస్ ఏకంగా 181 స్థానాలతో కూడిన జాబితాను సమాజ్‌వాదీ పార్టీకి పంపినట్లు సమాచారం.

Advertisement

Also Read: బిస్లెరీ నీరు తాగొచ్చా? వద్దా? FSSAI నివేదికపై బిస్లెరీ సంస్థ ఏం చెప్పిందంటే?

55 సీట్లు ఆఫర్ చేసిన ఎస్పీ?

మరోవైపు సీట్ల సంఖ్య కంటే గెలుపుపైనే దృష్టి పెట్టాలని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ పార్టీకి ఈ ఎన్నికలు ‘చావో రేవో’ లాంటివన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు నిర్దిష్టమైన ఓటు బ్యాంకు లేదని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం రెండు సీట్లు, రెండు శాతం ఓట్లు మాత్రమే సాధించిందని ఓ ఎస్పీ ఎంపీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సీట్ల కోసం పట్టుబట్టకుండా గత ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన స్థానాలనే స్థానాలనే కాంగ్రెస్ అడగాలని ఎస్పీ భావిస్తోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ సుమారు 55 సీట్లతో కూడిన జాబితాను కాంగ్రెస్‌కు పంపింది.

Also Read: జియో నుంచి క్రేజీ రీఛార్జ్ ప్లాన్.. 98 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత 5G డేటా.. ఫ్రీగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్!

Tags

Related News

తండ్రి వీలునామాలో పేరు లేకున్నా ఆస్తిలో వాటా పొందిన కొడుకు.. సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే

తమిళనాడులో కొత్త చిచ్చు.. కార్తీక దీపంపై రాజకీయ రగడ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం!

ఢిల్లీలో రూ.55 లక్షల బంగారం మాయం.. 6 రోజుల తర్వాత బెంగళూరులో ట్విస్ట్.. చివరకు ఏం జరిగిందంటే?

నాడు రూ.300 పెట్టుబడి.. నేడు వేల కోట్ల అధిపతి.. రజినీ బెక్టర్ వ్యాపార విజయ ప్రస్థానం ఇదే!

సూట్ విషయంలో భార్యతో గొడవ.. రూ.500 నోట్లకు నిప్పు పెట్టిన భర్త, వీడియో వైరల్!

గుజరాత్‌లో ఘోర విషాదం.. క్షణాల్లోనే కాలిబూడిదైన కారు.. ముగ్గురు సజీవ దహనం!

ఫుట్‌పాత్‌పై బైకర్ల ఓవరాక్షన్.. చుక్కలు చూపించిన ముగ్గురు మహిళలు.. నెట్టింట ప్రశంసల జల్లు!

Big Stories

Advertisement
×