Bengaluru: దేశంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు జీతాలు భారీ ఎత్తున ఉంటాయని చెబుతుంటారు. అందులో ఉద్యోగం పదేళ్లు కష్టపడితే జీవితాంతం సెటిల్ అయిపోవచ్చని చాలామంది భావిస్తుంటారు. జీతంలో ఏమోగానీ ఖర్చులు కూడా ఆ రేంజ్‌లో ఉంటాయని ఓ టెక్కీ చెప్పే ప్రయత్నం చేసింది. ఆమె నెల ఖర్చు ఏకంగా లక్షా 43 వేలు రూపాయలు. నమ్మడానికి విచిత్రంగా ఉన్నా ఇద ముమ్మాటికీ నిజం.
బెంగుళూరులో టెక్కీ నెల ఖర్చులు ఎంతో తెలుసా?
సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరు సిటీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జీతాలు భారీగా ఉంటాయని చాలామంది భావిస్తుంటారు. ప్రపంచంలోని ఫేమస్ కంపెనీలు అక్కడే కొలువుదీరాయి. వారి జీతానికి తగ్గుట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. ఏ మాత్రం తక్కువ చేసినా ఇతరుల వద్ద ముఖం చిన్న బుచ్చుకోవడం ఖాయం.
తాజాగా ఓ టెక్కీ పెట్టిన పోస్టు నెట్టింట్లో వైరల్ అవుతోంది. గూగుల్‌లో పని చేస్తున్న 25 ఏళ్లు పూజానరుల అనే టెక్కీ. ఫిబ్రవరి నెలకు సంబంధించి తన ఖర్చుల జాబితాను బయట పెట్టింది. వాటిని చూసి అందరూ షాకయ్యారు. టెక్కీ షేర్ చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో పూజా చేసిన ఖర్చు దాదాపు రూ.1.43 లక్షలు.
నెలకు దాదాపు లక్షన్నర? ఇకపై ఈ లెక్కలు వేయను
అద్దె రూ.22,400గా పేర్కొన్ననారు. పని మనిషికి, వంట సరుకులకు కేవలం రూ.2,800 మాత్రమే. ఇక విద్యుత్, ఇతర బిల్లులు రూ.2,000 ఉన్నాయి. ఇక టెక్కీ ఇతర ఖర్చుల విషయానికి వద్దాం. వీకెండ్ ఎంజాయ్ కోసం వారానికి రెండువేలు చొప్పున నెలకు రూ.8,000 ఖర్చు చేస్తున్న తెలిపారు. ఇంటికి వెళ్లడానికి విమాన టికెట్లకు రూ.16 వేలు.
ఫ్రెండ్స్ బర్త్ డే, లేకుంటే మ్యారేజ్ సెలబ్రేషన్స్‌కు గిఫ్ట్ ల ఖరీదు అక్షరాలా 20 వేల రూపాయలుగా ప్రస్తావించారు. ప్రతి నెలా ఇంత ఖర్చు ఉందని చెప్పుకొచ్చింది. ఫిబ్రవరిలో కొన్ని అదనపు ఖర్చులు తోడవ్వడంతో అమాంతంగా పెరగినట్టు క్లారిటీ ఇచ్చారు. దీనికితోడు కొత్త ఇంటికి షిఫ్ట్ కావడం వల్ల మూవర్స్ అండ్ ప్యాకర్స్‌కు రూ.3,000 ఇచ్చినట్టు తెలిపారు.
ALSO READ: రెండు దశల్లో జనాభా లెక్కింపు, ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు
ఇంటి సెక్యూరిటీ డిపాజిట్ కింద 66 వేలు చెల్లించాల్సి వచ్చిందని రాసుకొచ్చారు. ఇవన్నీ కూడా అందులో కలిపి మొత్తం రూ.1.43 లక్షలకు చేరిందని వివరించారు. లేకుంటే అందులో సగం మాత్రమే ఆమె ఖర్చు. ఐటీ కారిడార్‌లో ప్రచారం మరోలా ఉంది. అసలు టెక్కీలు ఖర్చు చేయరని, ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా అడుగులు వేస్తుంటారని అంటారు.
వాటికి పూజా భిన్నంగా ఉన్నారు. ఖర్చు లెక్కించిన తర్వాత మైండ్ బ్లాక్ అయ్యిందని మళ్లీ ఇలాంటి లెక్కలు ఎప్పుడూ వేయకూడదని డిసైడ్ అయినట్టు ఆమె తన వీడియోలో క్యాప్షన్ ఇచ్చారు. బెంగళూరు సిటీలో అన్నీ ఖరీదైనవే. ఈ ఖర్చులను తగ్గించుకోవాలన్నది ఆలోచనగా చెప్పుకొచ్చారు.పైన వివరాలతో పూజ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. వ్యూస్ పెంచుకోవడానికి టెక్కీ ఆడిన కొత్త డ్రామా అంటూ కొందరు నెటిజన్స్ అంటున్నారు. మధ్య తరగతి వ్యక్తి సగం ఏడాది ఆదాయమని అంటున్నారు.