E-Paper
Advertisement

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!
Advertisement

Ayodhya Ram Temple: అయోధ్యలోని ప్రముఖ రామజన్మభూమి మందిరంలో జరిగిన విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ ప్రాంగణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఏకంగా 105 విరాళాల దొంగతనం ఘటనలను గుర్తించినట్లు ప్రత్యేకాన్వేషణ బృందం (SIT) సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ కేసు పురోగతికి సంబంధించిన వివరాలను సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించారు.

త్వరలోనే ఛార్జ్‌షీట్

ఈ కేసులో సిట్ విచారణ దాదాపు చివరి దశకు చేరుకుందని సోలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు వివరించారు. ఈ నెల 25వ తేదీ నాటికి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఛార్జ్‌షీట్ సమర్పించిన తర్వాత చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత మేజిస్ట్రేట్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నిందితుల అరెస్టులు, సేకరించిన సీసీటీవీ పుటేజీ, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను న్యాయస్థానం క్షుణ్ణంగా పరిశీలించి రికార్డుల్లోకి తీసుకుంది.

అందుకు సుప్రీం నిరాకరణ

Advertisement

విచారణ సందర్భంగా పిటిషనర్లు సిట్ స్టేటస్ రిపోర్టు ప్రతిని తమకు ఇప్పించాలని కోరగా సుప్రీంకోర్టు అందుకు నిరాకరించింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. సెషన్స్ జడ్జి పరిధిలో ఉన్న ఈ వ్యవహారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోవడం లేదని, భవిష్యత్తులో అవసరమని భావిస్తే తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, ఆలయ విరాళాల రశీదులను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా రూపొందించి, కానుకలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్లలో భద్రపరుస్తున్నట్లు నివేదిక పేర్కొంది.

సరికొత్త పాలన వ్యవస్థ

విరాళాల చోరీ ఉదంతం తీవ్ర దుమారం రేపడంతో రామమందిర ట్రస్ట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ట్రస్ట్ ముఖ్య అధికారులు చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలను పదవుల నుంచి తొలగించారు. ఆలయ నిర్వహణలో పారదర్శకత కోసం సీఈవో నేతృత్వంలో కొత్త పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ బాధ్యతలను మాజీ సైనికాధికారి జితేంద్ర మిశ్రాకు అప్పగించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తామని సీఈవో హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: హోటల్లో అడుగుపెట్టగానే.. గదిని ఎందుకు ఫొటోలు తీయాలి? లేకపోతే జరిగే నష్టం ఏంటి?

కఠిన చట్టాల కింద కేసులు

విరాళాల చోరీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటూ లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సిట్ ను యూపీ ప్రభుత్వం జూన్ 13న ఏర్పాటు చేసింది. ఈ కమిటీ జూన్ 23నే ప్రాథమిక నివేదికను సమర్పించి కొన్ని కఠినమైన సిఫార్సులు చేసింది. ఈ వ్యవహారంలో నమోదైన ఎఫ్.ఐ.ఆర్‌లో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూలతో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులందరినీ అరెస్టు చేసి అవినీతి నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టారు.

Also Read: ఒకే ఒక్క తప్పిదం.. ఎడారిలో ఏర్పడ్డ ‘బుల్లి సముద్రం’.. సరిగ్గా 100 ఏళ్ల క్రితం ఏం జరిగింది?

Tags

Related News

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×