Adilabad RIMS: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని వార్డులను దట్టమైన పొగలు కమ్మేశాయి. ఇంక్యుబేటర్‌లో చికిత్స పొందుతున్న నవజాత శిశువులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఈ ఘటనలో ఒక శిశువు మృతి చెందింది. మిగతా నవజాత శిశువుల పేరెంట్స్, ఆసుపత్రి సిబ్బంది హుటాహుటిన వార్డులో చిక్కుకున్న 24 మంది నవజాత శిశువులను రెస్క్యూ చేశారు. పొగలు అంతా వ్యాపించడంతో చిన్నారులు తీవ్ర అస్వస్థలు గురయ్యారు.. ఒకరు మరణించగా, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టలు తెలుస్తోంది. రెస్క్యూ చేసిన శిశువులను చికిత్స కోసం హుటాహుటిన ఇతర ఆసుపత్రులకు తరలించారు. అసలు ఏం జరిగింది?
సోమవారం అర్ధరాత్రి వేళ ఎస్‌ఎన్‌సీయూ వార్డులో దాదాపు 25 మందికి పైగా నవజాత శిశువులు చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో ఏసీలో ఒక్కసారిగా పేలుడు చోటు చేసుకుంది. క్షణాల వ్యవధిలో వార్డు అంతటా దట్టమైన పొగ వ్యాపించింది. చిన్నారులు ఊపిరి తీసుకోలేని విధంగా అక్కడ పరిస్థితి నెలకొంది. పేలుడు శబ్దం విన్న తల్లిదండ్రులు, ఆసుపత్రి సిబ్బంది వార్డులోకి పరుగులు తీశారు. తమ పిల్లలను కాపాడుకునేందుకు ఆసుపత్రి కిటికీలను బద్దలు కొట్టారు. చివరకు రెండు డజను శిశువులను కాపాడారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇవ్దరు శిశువుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగినప్పుడు వార్డులో 24 మంది నవజాత శిశువులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రక్షించిన 23 శిశువులను అంబులెన్స్ లలో వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో అగ్నిప్రమాదం గురించి తెలియగానే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. వెంటనే కలెక్టర్ రిమ్స్ ఆసుపత్రికి చేరుకుని కొన్ని గంటల పాటు అక్కడే ఉండి పరిస్థితినీ సమీక్షించారు. ఏసీలో లోపం వల్లే ఈ ఘటనకు ప్రధాన కారణం అని ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది. రెస్క్యూ చేసిన 24 మందిని వెంటనే వివిధ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. ఘటనకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరిగిన తర్వాత లోపాలను గుర్తించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
అగ్నిప్రమాద ఘటన తీవ్ర భయభ్రాంతులకు గురిచేసిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఏసీ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగ అలుముకున్నాయని తెలిపారు. ఆ సమయంలో వెలుతురు లేక చీకటిగా ఉండడంతో ఏమి చేయాలో అర్థం కాని భయానక పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. మంటలను ఆర్పే సిలిండర్లతో అద్దాలను పగలగొట్టి చిన్నారులను రెస్క్యూ చేసినట్లు చెబుతున్నారు. ఈ ఘటనలో కన్నుమూసిన నవజాత శిశువు తల్లితండ్రులది విషాద గాథ. ఇచ్చోడకు చెందిన పీర్ ఖాన్ – సబా ఖానం దంపతులకు ఇద్దరు కుమారులు.
ALSO READ: కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!
కూతురు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కూతురు పుట్టిందనే ఆనందం కొన్ని క్షణాల్లో ఆవిరైపోయింది. ఈ ఘటన వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రైవేట్ ఆసుపత్రిలో 7 నెలలకే ప్రసవం కావడం, తక్కువ బరువు ఉండడంతో ఇంక్యుబేటర్‌లో చికిత్స అందించాలని వైద్యులు సూచించడంతో రిమ్స్ లోని NICU లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పాప కోలుకున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన సమయంలో తాను అక్కడే ఉన్నానని, నా చేతులతో 10 మంది నవజాత శిశువులను కాపాడనని, నా కూతురును కాపాడుకోలేక పోయానని అవేదన వ్యక్తం చేస్తున్నారు పీర్ ఖాన్.