E-Paper
Advertisement

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!
Advertisement

Hemant Soren: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను భూ కుంభకోణం, మనీలాండరింగ్ వ్యవహారాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసు విచారణను రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (PMLA) కోర్టు మరింత వేగవంతం చేయడంతో ఆయనకు చట్టపరమైన చిక్కులు పెరిగాయి. సోమవారం సాయంత్రం 4 గంటలలోపు సీఎం సోరెన్ వ్యక్తిగతంగా కానీ, లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానీ తమ ముందు తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టులో చుక్కెదురు..

Advertisement

గతంలో సెప్టెంబర్ 19న జరిగిన విచారణకు అధికారిక కార్యక్రమాల నెపంతో సోరెన్ గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో, ఆయనపై అధికారికంగా అభియోగాలు నమోదు చేసే ప్రక్రియపై కోర్టు రెండు పక్షాల వాదనలను విననుంది. మరోవైపు, ఈ విచారణ ప్రక్రియపై తక్షణ స్టే విధించాలని, కేసును కొట్టివేయాలని కోరుతూ హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్ హైకోర్టు ఇటీవల తిరస్కరించడం ఆయనకు పెద్ద షాక్ అనే చెప్పాలి.

అసలేంటీ కేసు?

Advertisement

రాంచీలోని బార్గాయిన్ ప్రాంతంలో ఉన్న 8.86 ఎకరాల గిరిజన భూమిని నకిలీ పత్రాలు, ప్రభుత్వ రికార్డుల తారుమారు ద్వారా అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలపై ఎంఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లోతైన విచారణ జరుపుతోంది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా, గతంలో జూన్ 8న సోరెన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను కూడా ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. దీంతో సోరెన్‌పై అభియోగాల నమోదు అనివార్యంగా మారింది.

Also Read: తల లేదు, కాళ్లు లేవు… NTTPS కాలువలో కట్ చేసిన మొండం! అసలు ఎవరా మహిళ?

Tags

Related News

ఓటర్లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్.. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేని వారికి మరో ఛాన్స్!

సీజేఐ సూర్యకాంత్‌పై వివాదాస్పద పోస్ట్.. కేరళ కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టు నోటీసులు!

‘పేదలు కాలుష్యం చేయరు.. ధనికులే అసలు కారణం’.. ఢిల్లీ పొల్యూషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం!

సోనియా గాంధీ ఓటు హక్కు కేసులో బిగ్ ట్విస్ట్.. ఢిల్లీ కోర్టు కీలక ఉత్తర్వులు!

26/11 తరహా దాడికి స్కెచ్.. స్కూబా డైవర్లుగా లష్కరే ఉగ్రవాదులకు ట్రైనింగ్!

కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. 4 బోగీల్లో ఎగిసిపడిన మంటలు!

ఇది భారత్ లేకుంటే బంగ్లాదేశా? బాబోయ్.. ఈ రష్ ఏంటి? రైల్వేశాఖ ఏం చేస్తోంది?

ఒకే కుటుంబంలో ఏడుగురి హత్య.. బెంగళూరులో షాకింగ్ ఘటన, ఏడేళ్ల బాలుడితోపాటు..

Big Stories

Advertisement
×