viral video: ఏం జరిగిందో తెలీదు.. ఓ జంటపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జంటపై బహిరంగంగా దాడి జరుగుతున్న సమయంలో అడ్డుకోవడానికి బదులు వీడియో తీయడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అసలు ఏం జరిగింది?
బీహార్‌లోని జముయి అటవీ ప్రాంతంలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువ జంటను గుంపుగా చుట్టుముట్టి వారిపై దాడి చేస్తూ, వేధించారు కొందరు యువకులు. దీనికి సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఈ వీడియో వెలుగులోకి రావడంతో స్థానిక యంత్రాంగం అలర్టయ్యింది. వైరల్ అవుతున్న వీడియోలో అటవీ ప్రాంతంలో కొంతమంది యువకులు ఓ యువతీ యువకుడ్ని చుట్టుముట్టినట్టు అందులో కనిపిస్తోంది.
ఆ గుంపు వారిని దూషిస్తూ దాడి చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. యువతిపై దాడి జరుగుతున్నట్లు అందులో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, వీడియో చిత్రీకరించిన తేదీ ఇంకా నిర్ధారణ కాలేదు. వైరల్ అవుతున్న వీడియోపై జముయి పోలీసులు సుమోటోగా స్వీకరించి దర్యాప్తు చేపట్టారు. అందులో కనిపించే వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
జముయి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వజీత్ దయాల్ మాట్లాడుతూ ఈ ఘటనను ధృవీకరించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపారు. బాధితులతో మాట్లాడి నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని గుర్తించిన తర్వాత చట్ట ప్రకారం వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
ALSO READ: చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు