Chennai: తమిళనాడులో అన్నామలై మళ్లీ యాక్టివ్ అయ్యారు. సీఎం విజయ్ టూర్‌పై విపక్షాలు సైలెంట్ కావడంతో ఆయన లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా సీఎం విజయ్‌పై ఘాటు విమర్శలు చేశారు. యూకెను చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా అభివర్ణించారు. రాష్ట్రం నుంచే పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం ఫోకస్ చేయాలన్నారు.
మాజీ ఐపీఎస్ అధికారి, రాజకీయ నేత అన్నామలై యాక్టివ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు తర్వాత సైలెంట్ అయిన ఆయన, సీఎం విజయ్ పాలనపై ఏ విధంగా సాగుతోందని పరిశీలన చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించకుండా విదేశాలకు సీఎం విజయ్ వెళ్లడంపై ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం మధురైలో మీడియా సమావేశం నిర్వహించారు అన్నామలై. యూకెను చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థగా వర్ణించిన ఆయన, అక్కడ నిధులు లేవన్నారు.
ఒక్క శాతం వృద్ధిరేటుతో నెమ్మదిగా సాగుతున్న ఆ దేశానికి భారీగా ప్రతినిధి బృందంతో వెళ్లడం వల్ల ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. మీరు అక్కడికి వెళ్లి తమిళనాడులో పెట్టుబడి పెట్టాలని అడిగితే వాళ్లు ఏమిస్తారని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ అక్కడి నుంచి పెట్టుబడులు వచ్చినా అవి అక్కడున్న భారతీయ కంపెనీల అనుబంధ సంస్థల నుంచి వస్తాయన్నారు. దీనివల్ల కొత్తగా విదేశీ మూలధనం రాదని తేల్చేశారాయన. దానికి బదులుగా సీఎం విజయ్ తమిళనాడులోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు వెళ్లి స్థానిక వ్యాపారాలతో నేరుగా సంప్రదించాలని సూచించారు.
చెన్నై నుంచి లండన్‌కు ఎమిరేట్స్ విమానంలో ముఖ్యమంత్రి వెళ్లే బదులు చెన్నై నుంచి కోయంబత్తూరు లేదా మదురైకి ఇండిగో విమానంలో వెళ్లాలన్నారు. తమిళనాడులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కంపెనీలను విస్తరించేలా ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం పన్ను ప్రోత్సాహకాలను అందించవచ్చన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ విలువ దాదాపు 4.1 ట్రిలియన్ డాలర్ల అని, యూకే ఆర్థిక వ్యవస్థ 3.4 ట్రిలియన్ డాలర్లు మాత్రమేనన్నారు.
ALSO READ: భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!
లండన్‌కు బదులు ముంబై, ఢిల్లీ, బెంగళూరుకు వెళ్లాలన్నారు. అక్కడి నుంచే పెట్టుబడులు తీసుకురావాలని, ప్రతిదానికీ విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. సీఎం విజయ్ ఆరు రోజుల యూకే టూర్ ద్వారా రాష్ట్రానికి రూ.15,000 కోట్ల పెట్టుబడులు, 10 వేల ఉద్యోగాలు లభించాయని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు రియాక్ట్ అయ్యాయి. ఈ క్రమంలో మొత్తం లెక్కల చిట్టా విప్పి చూపించారు అన్నామలై.
முதலீட்டை ஈர்ப்பதற்காக லண்டன் சென்று வந்துள்ளார் முதலமைச்சர் திரு விஜய் அவர்கள். இங்கிலாந்து நாட்டின் வளர்ச்சியே 1% தான். அங்கு முதலீடு செய்வதே, மஹிந்திரா உள்ளிட்ட நமது இந்திய நிறுவனங்கள்தான்.
எனவே, முதலமைச்சர் வெளிநாடு செல்வதை விட்டுவிட்டு, கோயம்புத்தூர், மதுரை உள்ளிட்ட… pic.twitter.com/el2GI7lFsL
— K.Annamalai (@annamalai_k) September 20, 2026