BigTV English

Luna 25 : రష్యా ప్రయోగం విఫలం.. చంద్రుడిపై కూలిన ల్యాండర్.. చంద్రయాన్-3పై టెన్షన్..

Luna 25 : రష్యా ప్రయోగం విఫలం.. చంద్రుడిపై కూలిన ల్యాండర్.. చంద్రయాన్-3పై టెన్షన్..

Luna 25 : చంద్రుడిపై పరిశోధనలకు రష్యా చేపట్టిన ప్రయోగం విఫలమైంది. చంద్రుడి కక్ష్యలోకి దిగే సమయంలో ల్యాండర్ లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో అది చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రయోగం విఫలమైందని రష్యా స్పేస్ ఏజెన్సీ ..రోస్‌కాస్మోస్‌ అధికారికంగా ప్రకటించింది.


చంద్రుడిపై పరిశోధనల కోసం రష్యా ఈ ప్రయోగం చేపట్టింది. 1976 తర్వాత జాబిల్లిపైకి రష్యా రాకెట్ పంపించింది. ల్యాండర్ లూనా-25లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని వెల్లడించిన కొన్ని గంటలకే అది కుప్పకూలిపోయినట్లు గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడానికి ముందు ల్యాండర్‌లో ఇబ్బందులు తలెత్తాయి. ఆ సమయంలో ఈ ప్రయోగం విజయవంతంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సమస్యను విశ్లేషించేందుకు రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు.

ల్యాండింగ్‌కు ముందు కక్ష్యకు చేరడానికి శనివారం లూనా-25 కీలక విన్యాసాన్ని చేపట్టింది. ఆ ప్రయత్నంలో వ్యోమనౌకలోని ఆటోమేటిక్‌ స్టేషన్‌లో ఎమర్జెన్సీ పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్దేశిత పరామితులకు అనుగుణంగా ఆ విన్యాసం సాగలేదు. ఈ నేపథ్యంలో ల్యాండింగ్‌ సమయంలో కూలిపోయింది. ఈ వ్యోమనౌక ఇప్పటికే చంద్రుడికి సంబంధించిన ఫోటోలను పంపింది. ఈ నెల 11న రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్‌ నుంచి రష్యా ఈ ప్రయోగం చేపట్టింది.


రష్యా ప్రయోగం విఫలం కావడంతో భారత్ చేపట్టిన చంద్రయాన్‌-3 పై ఉత్కంఠ ఏర్పడింది. ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ విక్రమ్ దిగనంది. సరిగ్గా అదే ప్రాంతంలోనే లూనా-25 బొగుస్లావ్‌స్కీ బిలానికి చేరువలో దిగాల్సి ఉండగా కూలిపోయింది. దీంతో చంద్రయాన్-3 లోని ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ పై టెన్షన్ నెలకొంది.

జూలై 14 శ్రీహరి కోట నుంచి నింగిలోకి చంద్రయాన్-3 దూసుకెళ్లింది. ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా ఇస్రో చంద్రయాన్-3ను ప్రయోగించింది. 40 రోజుల సుధీర్ఘ ప్రయాణం తర్వాత ఈ నెల 23న సాయంత్రం చంద్రుడిపై చంద్రయాన్-3 దిగనుంది. చంద్రయాన్ -3 ప్రయోగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఇస్రో శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

ఆగస్టు 16న చంద్రయాన్‌-3 చివరి దశ కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగస్టు 17న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి ల్యాండర్‌ విక్రమ్ విడిపోయింది. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడిపై అడుగుపెడుతుందని ఇస్రో ప్రకటించింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×