BigTV English

DRDO Drone : కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్‌.. కారణమిదేనా..?

DRDO Drone : కుప్పకూలిన డీఆర్‌డీవో డ్రోన్‌.. కారణమిదేనా..?

DRDO Drone : కర్నాటకలో ఓ భారీ డ్రోన్ కుప్పకూలింది. ఇది భారత రక్షణ పరిశోధనాభివృద్ధి సంస్థకు చెందిన డ్రోన్‌ గా గుర్తించారు. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హరియూర్‌ తాలుకాలోని వడ్డికెరె గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో డ్రోన్ భారీ శబ్ధంతో కూలిపోయింది. పొలాల్లో డ్రోన్‌ కూలిపోయినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కూలిన డ్రోన్‌ను చూసేందుకు స్థానికులు భారీగహా ప్రమాద స్థలానికి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.


కొంత కాలంగా యూఏవీల అభివృద్ధిపై డీఆర్‌డీవో పరిశోధనలు చేస్తోంది. తపస్‌పేరుతో ఈ డ్రోన్‌ రూపొందించింది. ఆదివారం ఉదయం ఈ డ్రోన్ డీఆర్‌డీవో పరీక్షించింది. ఆ సమయంలోనే డ్రోన్ కూలిపోయిందని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై రక్షణ శాఖకు సమాచారం అందించామని వివరించారు. ఏ కారణం వల్ల డ్రోన్‌ కూలిపోయిందో విశ్లేషిస్తున్నామని తెలిపారు.

డీఆర్డీవో అధికారులు పరీక్షిస్తున్న సమయంలో డ్రోన్ హ్యాండ్లర్ తో సంబంధాలు తెగిపోయాయని భావిస్తున్నారు. అందువల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ దిశగానే డీఆర్డీవో అధికారులు విచారణ చేపట్టారు.


Tags

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×