E-Paper
Advertisement

Traffic Jam: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!

Traffic Jam: ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగని ట్రాఫిక్ నరకం.. 40 గంటలుగా నిలిచిపోయిన వాహనాలు!
Advertisement

Traffic Jam: ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేపై ఖోపోలి సమీపంలోని అదోషి టన్నెల్ వద్ద ఫిబ్రవరి 3న ఒక రసాయన ట్యాంకర్ బోల్తా పడటంతో భారీ ప్రమాదం సంభవించింది. అత్యంత మండే స్వభావం గల రసాయనం కావడంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు అటు ఎక్స్‌ప్రెస్‌వేను, ఇటు పాత ముంబై-పుణే రహదారిని పూర్తిగా మూసివేశారు. దీనివల్ల 40 గంటలకు పైగా వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి.

ఈ అకస్మాత్తు ట్రాఫిక్ స్తంభన వల్ల వేలాది మంది ప్రయాణికులు రోడ్డుపైనే చిక్కుకుపోయారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్న కుటుంబాలు ఆహారం, కనీస తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రిపూట ప్రయాణించే బస్సుల్లో ఉన్న వారు కనీస మరుగుదొడ్డి సౌకర్యాలు, వైద్య సహాయం అందక గంటల తరబడి నరకయాతన అనుభవించినట్లు ప్రయాణికులు తెలిపారు.

Advertisement

ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఎక్స్‌ప్రెస్‌వే కంట్రోల్ రూమ్, హైవే పోలీస్ హెల్ప్‌లైన్ నంబర్లు స్పందించకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో, యు-టర్న్‌ల గురించి మార్గదర్శకత్వం అందించడంలో అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా, ట్రాఫిక్ నిలిచిపోయినా టోల్ వసూలు కొనసాగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ట్రాఫిక్ జామ్ ప్రభావం కేవలం ప్రయాణికులపైనే కాకుండా నగరాల నిత్యావసరాలపై కూడా పడింది. కొల్హాపూర్, సతారా, సాంగ్లీ వంటి ప్రాంతాల నుండి ముంబై, థానే నగరాలకు అందాల్సిన పాలు, కూరగాయల సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇది నగరాల్లోని మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

Advertisement

అంతేకాకుండా ప్రమాదం జరిగిన చోట పరిస్థితిని అదుపు చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), బీపీసీఎల్ (BPCL) బృందాలు రంగంలోకి దిగాయి. ట్యాంకర్ నుండి గ్యాస్ లీకేజీ భయం పొంచి ఉండటంతో, నిపుణుల సమక్షంలో అత్యంత జాగ్రత్తగా సహాయక చర్యలు చేపడుతున్నారు. వాయువు లీకేజీ కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాహనాలను ఇతర ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు.

Also Read: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ. 1.07 కోట్ల మోసం.. ఢిల్లీకి చెందిన నిందితుడు అరెస్ట్

ప్రస్తుతానికి ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణం సురక్షితం కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరంగా ముంబై లేదా పుణే చేరుకోవాల్సిన వారు రైలు ప్రయాణాన్ని ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, డెక్కన్ క్వీన్, సింహగడ్ ఎక్స్‌ప్రెస్, వందే భారత్ వంటి రైళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత విశ్వసనీయమైన మార్గాలని నిపుణులు తెలుపుతున్నారు.

Related News

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

స్పామ్, ఫ్రాడ్ కాల్స్‌ టెన్షన్‌కు ఇక చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం?

ప్రపంచాన్ని సైతం కదిలించిన చరిత్ర.. అక్టోబర్ 17 ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×