BigTV English

Mukul Roy hospitalised: ఆసుపత్రిలో టీఎంసీ నేత ముకుల్‌రాయ్, ఆరోగ్య పరిస్థితి..

Mukul Roy hospitalised: ఆసుపత్రిలో టీఎంసీ నేత ముకుల్‌రాయ్, ఆరోగ్య పరిస్థితి..

Mukul Roy hospitalised(Today latest news telugu): తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రైల్వే మంత్రి ముకుల్‌రాయ్ ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆయన తలకు బలమైన గాయమైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే ముకుల్‌రాయ్‌ని ఆసుపత్రికి తరలించారు ఆయన కొడుకు సుభ్రాంగ్షు‌రాయ్. ప్రస్తుతం ఆయనకు ట్రీట్‌‌మెంట్ చేస్తున్నారు డాక్టర్లు.


బుధవారం రాత్రి ముకుల్‌రాయ్ బాత్రూమ్‌లో జారిపడిపోయారు. తలకు బలమైన గాయంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే ఆయన్ని కోల్‌కోతాలోని ఓ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నమాట.

ఆయన ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా వైద్య బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపాయి. ఏడుపదుల ముకుల్‌రాయ్ సరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన పడిపోయే ముందు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. రిపోర్టులకు సంబంధించి నివేదిక రావాల్సి ఉందని డాక్టర్లు చెబుతున్నారు.


ALSO READ: బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. అపోలో ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు..

తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక సభ్యుల్లో ముకుల్‌రాయ్ ఒకరు. యూపీఏ -2లో షిప్పింగ్, రైల్వేమంత్రిగా పని చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఎంసీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయారు. 2021లో బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర కృష్ణానగర్ సీటు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఏమైందోగానీ మళ్లీ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. అంతుకుముందు కాంగ్రెస్‌లో యూత్ నాయకుడిగా పని చేశాడు. ఆ తర్వాత మమతాబెనర్జీతో కలిసి టీఎంపీ పార్టీ స్థాపించిన వారిలో ఆయన ఒకరు.

 

Tags

Related News

Bihar Politics: బీహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర ర్యాలీ.. మోదీ తల్లిని దూషించిన వ్యక్తి అరెస్ట్

Trump Tariffs: భారత్ బిగ్ స్కెచ్! ట్రంప్‌కు దూలతీరిందా?

Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పొంగిపోర్లుతున్న వాగులు, వంకలు..

Modi Government: వాటిపై పన్ను కట్టాల్సిన పని లేదు.. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Richest Village: ఆ ఊళ్లో ప్రతి రైతూ కోటీశ్వరుడే.. ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం ఎక్కడంటే!

Trump Tariffs Effect: అమెరికా 50% పన్ను ప్రభావం.. 40 దేశాల్లో స్పెషల్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తోన్న భారత్

Big Stories

×