BigTV English
Advertisement

T20 WC Winner Team India: ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెట్ జట్టు

T20 WC Winner Team India: ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెట్ జట్టు

T20 WC Winner Team India Reach Modi House: టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ విజేత టీమిండియా జట్టు ఉదయం 6 గంటలకు స్పెషల్ ఫ్లైట్‌లో స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ ఎయిర్ పోర్టు నుంచి మౌర్య హోటల్‌కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు.. అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఈ మేరకు ప్రపంచ కప్ అందుకున్న భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ అభినందించారు


ప్రపంచకప్ సాధించిన టీమిండియా జట్టుకు ప్రధాని మోదీ నివాసంలో అల్పాహార విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆటగాళ్లతో కలిసి ప్రధాని అల్పాహారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ.. జట్టు సభ్యులతో రెండు గంటలపాటు సమావేశం కానున్నారు. కాగా, ప్రధాని మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలిశారు. తొలుత భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించి అభినందనలు తెలిపారు. తర్వాత సపోర్టింగ్ స్టాప్‌తో మోదీ ములాఖత్ అయ్యారు.

ప్రధాని మోదీ భేటీ తర్వాత టీమిండియా ప్రత్యేక విమానంలో ముంబైకు బయలుదేరనుంది. సాయంత్రం 5 గంటలకు ముంబై నగర వీధుల్లో టీమిండియా జట్టు విజయోత్సవ ర్యాలీలో పాల్గొననుంది. ఇప్పటికే ఈ ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లను బీసీసీఐ పూర్తి చేసింది. ర్యాలీ అనంతరం వాంఖడే స్టేడియంలో బీసీసీఐ.. టీమిండియా జట్టును అభినందించనుంది.


గతేడాది వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లోకి ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా వెళ్లి భారత ఆటగాళ్లకు ధైర్యం చెప్పారు.

Tags

Related News

HCA Controversy: HCAలో ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ కలకలం…ముస‌లి వాళ్ల‌ను కుర్ర క్రికెట‌ర్లు అంటూ !

Suryakumar Yadav: బాలీవుడ్ హీరోయిన్ తో సీక్రెట్ గా గుడికి వెళ్లిన‌ సూర్య కుమార్..!

Sara Tendulkar: అర్జున్ టెండూల్కర్ కాబోయే భార్యతో సారా నైట్ పార్టీ.. ఫోటోలు వైరల్

Gambhir-Harshit Rana: వాడు నా కొడుకు అంటూ ట్రోల్ చేస్తున్నారు..కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర‌ పెట్టుకోండి!

Team India Jersy: బుర‌ద ప‌ట్టిన టీమిండియా జెర్సీ వెనుక ఉన్న సీక్రెట్ ఇదే..చ‌రిత్ర‌లో మిగిలిపోవ‌డం ప‌క్కా

IND vs WI: రెండో టెస్ట్ లోనూ విజ‌యం…విండీస్ ను వైట్ వాష్ చేసిన టీమిండియా.. WTCలో మ‌న ర్యాంక్ ఎంతంటే

IND vs WI: తగలరాని చోట తగిలిన బంతి..కుప్ప‌కూలిన కేఎల్ రాహుల్‌…10 అడుగులు ప‌రుగెత్తి

SLW vs NZW: నేడు శ్రీలంక‌తో న్యూజిలాండ్ మ్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్‌ పాయింట్ల ప‌ట్టిక ఇదే

Big Stories

×