BigTV English

Rohit Sharma Phone Call To Dravid: ఆరోజు రోహిత్ ఫోన్ చేసి ఉండకపోతే: ద్రవిడ్

Rohit Sharma Phone Call To Dravid: ఆరోజు రోహిత్ ఫోన్ చేసి ఉండకపోతే: ద్రవిడ్

Dravid reveals how Rohit stopped him from quitting after 2023 ODI WC Heartbreak: వన్డే వరల్డ్ కప్ 2023 ఓటమి అనంతరం అందరిలాగే నాకు ఎంతో బాధ కలిగిందని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ప్రపంచకప్ విజయం తర్వాత, కోచ్ పదవికి వీడ్కోలు కార్యక్రమం బార్బడోస్ డ్రెస్సింగ్ రూమ్ లో జరిగింది. ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎప్పుడూ తన మనసులోని మాటలను బయటకు చెప్పని ద్రవిడ్ ఈ సందర్భంగా జట్టు సహచరులతో పంచుకున్నాడు.


వన్డే ప్రపంచకప్ లో ఓటమన్నది ఎరుగని జట్టుగా టీమ్ ఇండియా ఫైనల్ వరకు దూసుకెళ్లింది. అంతవరకు ఎంతో హ్యాపీగా ఉన్నాం. కానీ ఫైనల్లో ఓటమిని తట్టుకోలేక పోయానని ద్రవిడ్ అన్నాడు. సరే, అప్పటికే కోచ్ గా నా టైమ్ అయిపోయింది. ఇంకెందుకు బ్యాగ్ సర్దుకుని వెళ్లిపోదామని అనుకున్నాను. నిజంగా ఆ క్షణం చాలా విరక్తి కలిగింది.

సరిగ్గా అదే సమయంలో రోహిత్ శర్మ ఫోన్ చేశాడు. అంత పని చేయవద్దు, టీ 20 ప్రపంచకప్ వరకు ఉండమని అన్నాడు. నిజంగా రోహిత్ ఆ మాట అని ఉండకపోతే, ఇంతటి మధురానుభూతిని పొందేవాడిని కాదేమోనని అన్నాడు. టీ 20 ప్రపంచకప్ గెలిచిన ఆనందం నా మనసంతా నిండిపోయింది. ఒక పరిపూర్ణ క్రికెటర్ గా నా జన్మ ధన్యమైందని అన్నాడు.


Also Read: కొహ్లీ విషయంలో.. నాడు ధోనీ, నేడు రోహిత్

ఈ ఆనందాన్ని నాకు కలిగించిన రోహిత్ శర్మకు థ్యాంక్స్ చెబుతున్నానని అన్నాడు. భారత జట్టులోకి రావడమే ఒక గొప్ప విషయం. 140 కోట్ల మంది భారతీయుల్లో 15 మంది ఆడే క్రికెట్ జట్టులో మీరు ఒకరిగా ఉండటం చాలా గొప్ప విషయమని అన్నాడు. ఇది ఒక అద్రష్టం.. దీనిని నిలబెట్టుకోవడం మీ చేతుల్లోనే ఉందని జట్టు సభ్యులకు సూచించాడు. మీ అందరితో కలిసి పని చేయడం ఒక గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు.

రోహిత్ శర్మతో చాలాసార్లు జట్టు విషయంలో మాట్లాడాను. ఒకసారి అభిప్రాయాలు కలిసేవి. ఒకసారి కలిసేవి కాదు. అయినా సరే, అవేవీ మనసులో పెట్టుకోకుండా జట్టు విజయం కోసం పనిచేశామని అన్నాడు. ఇక ప్రపంచకప్ విజయానందాన్ని జట్టులో ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకుంటారని అన్నాడు. మన జట్టు చూపించిన పోరాటానికి, స్థిరత్వానికి ఎంతో గర్విస్తున్నానని అన్నాడు. అలాగే కోచ్ గా నా వెనుక ఉన్న టీమ్, సహాయకులకు కూడా రుణపడి ఉంటానని తెలిపాడు.

ఫైనల్ ఫోబియో ఇక పోయిందని అన్నాడు. ఇప్పుడా గీతను దాటేశామని తెలిపాడు. ఇక చివరిగా మీ అందరి ప్రేమాభిమానాలకు ఎంతో కృతజ్ఞుడిని అని అన్నాడు. ఒక గొప్ప జట్టు విజయం వెనుక ఎందరో ఉంటారు. అలా మన వెనుక బీసీసీఐ ఉంది. వారు ప్రోత్సహించే తీరు అత్యద్భుతమని కొనియాడి సెలవు తీసుకున్నాడు.

Related News

Sameer Rizvi : సమీర్ రిజ్వి అరాచకం… 9 సిక్సులు, 3 బౌండరీలతో రెచ్చిపోయాడుగా.. ఇదిగో వీడియో

Pro Kabaddi League 2025: నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్… తొలి వాచ్ తెలుగు టైటాన్స్ దే…టైమింగ్స్, ఉచితంగా ఎలా చూడాలంటే

OLYMPICS 2036 : 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్.. కావ్య పాప, సంజీవ్ తో రేవంత్ భారీ ప్లాన్

Nivetha Pethuraj: టీమిండియా ప్లేయర్ తో రిలేషన్.. ఇప్పుడు మరో వ్యక్తితో !

Arjun Tendulkar : ఎంగేజ్మెంట్ తర్వాత… గుళ్ల చుట్టూ తిరుగుతున్న సచిన్ టెండూల్కర్ ఫ్యామిలీ.. సానియా జోష్యంలో దోషముందా?

Asia Cup : ఆసియా కప్ లో ఎక్కువ మ్యాచ్ లు గెలిపించిన తోపు కెప్టెన్లు వీళ్లే… ధోనినే రియల్ మొనగాడు

Big Stories

×