E-Paper
Advertisement

Flipkart Under Rs9k Phones: రూ.9,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, రెడ్‌మి, పోకో సూపర్ డీల్స్

Flipkart Under Rs9k Phones: రూ.9,000 లోపు బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్.. ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్, రెడ్‌మి, పోకో సూపర్ డీల్స్
Advertisement

Flipkart Under Rs9k Phones| ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం బైబై 2025 (Flipkart Buy Buy 2025) మహా సేల్ లైవ్‌ లో జరుగుతోంది. ఈ స్పెషల్ సేల్ డిసెంబర్ 10 వరకు ఉంటుంది. ఈ సేల్‌లో ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, రెడ్‌మి, పోకో ఫోన్లు రూ.9 వేల లోపే దొరుకుతున్నాయి. పెద్ద బ్యాటరీ, మంచి కెమెరా, 5G సపోర్ట్ ఉన్న ఈ ఫోన్లు చాలా చవక ధరలో లభిస్తున్నాయి. ఈ అదిరిపోయే ఆఫర్లు వివరాలు మీ కోసం.

Redmi A4 5G – ధర కేవలం రూ.8,425 మాత్రమే

రెడ్‌మి A4 5G ఫోన్ రూ.8,425కే బైబై సేల్ లో లిస్ట్ అయింది. ఇందులో 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉన్నాయి. 50MP మెయిన్ కెమెరాతో ఫోటోలు సూపర్‌గా వస్తాయి. 5160mAh పెద్ద బ్యాటరీ ఉంది. రెండు రోజుల వరకు సులభంగా రన్ అవుతుంది. రోజువారీ ఉపయోగానికి తక్కువ ధరలో ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్!

Samsung Galaxy F07 పై రూ.4000 పైగా డిస్కౌంట్

Advertisement

శాంసంగ్ బ్రాండ్ లవర్స్‌కు ఇది బిగ్ ఆఫర్. గెలాక్సీ F07 ఫోన్ ఇప్పుడు కేవలం రూ.6,799కే దొరుకుతోంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ డెబిట్ కార్డు ఉపయోగిస్తే.. రూ.750 క్యాష్‌బ్యాక్, SBI క్రెడిట్ కార్డు ఉపయోగిస్తే.. 5% తక్షణ డిస్కౌంట్ కూడా వర్తిస్తుంది. శాంసంగ్ బ్రాండ్ ఫోన్ ఇంత తక్కువ ధరలో ఎప్పుడూ రాలేదు!

POCO M7 5G – ధర రూ.8,999 (ఎక్కువ ర్యామ్ + ఎక్కువ స్టోరేజ్)

పోకో M7 5G రూ.8,999కే లభిస్తోంది. ఈ ఫోన్‌ లో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ఉన్నాయి. మునుపటి మోడల్ కంటే ఈ కాన్ఫిగరేషన్ చాలా ఎక్కువ! 50MP రియర్ కెమెరా, 5160mAh బ్యాటరీ ఉన్నాయి. గేమ్స్ ఆడుతూ.. ఎక్కువ యాప్స్ ఒకేసారి వినియోగించేవారికి ఈ ఫోన్ పర్ఫెక్ట్.

Ai Plus Pulse – అతి తక్కువ ధర రూ.5,999 మాత్రమే!

Advertisement

బడ్జెట్ చాలా తక్కువ ఉన్నవాళ్లకు ఏఐ ప్లస్ పల్స్ బెస్ట్ ఆప్షన్. కేవలం రూ.5,999కే దొరుకుతోంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 50MP మెయిన్ కెమెరా, 5000mAh బ్యాటరీ ఉన్నాయి. సాధారణ కాల్స్, వాట్సాప్, యూట్యూబ్ ఎక్కువగా చూసే వాళ్లకు తక్కువ ధరలో ఇది సూపర్ ఫోన్.

బెస్ట్ డీల్, బ్యాంక్ ఆఫర్స్

యాక్సిస్ బ్యాంక్, SBI కార్డ్స్ తో చెల్లింపు చేస్తే.. ఎక్స్‌ట్రా డిస్కౌంట్
పాత ఫోన్ ఇస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది
ధరలు, ఆఫర్లు రోజుకోసారి మారతాయి కాబట్టి త్వరగా చెక్ చేయండి
సేల్ డిసెంబర్ 10తో ముగుస్తుంది – ఆలస్యం చేయకండి!

నాలుగు ఫోన్లలోనూ సేమ్ ఫీచర్స్

అన్ని ఫోన్లలో 50MP మెయిన్ కెమెరా ఉంది. కనీసం 5000mAh బ్యాటరీ ఉంది. 4GB నుంచి 6GB ర్యామ్, 64GB నుంచి 128GB స్టోరేజ్ ఉన్నాయి. సాధారణ ఉపయోగం, స్టూడెంట్స్ కు ఇవి అద్భుతమైన ఆఫర్లు. ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్ ఓపెన్ చేసి కార్ట్‌లో వేసేయండి!

Also Read: 40 లక్షల కంప్యూటర్లు హ్యాక్.. బ్రౌజర్ ఎక్స్‌టెన్షన్స్‌తో ప్రమాదం.. ఈ జగ్రత్తలు పాటించండి

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×