E-Paper
Advertisement

UP Killer Storm: యూపీలో గాలి వాన బీభత్సం.. 74 మంది మృతి, 38 జిల్లాల్లో అలర్ట్

UP Killer Storm: యూపీలో గాలి వాన బీభత్సం.. 74 మంది మృతి,  38 జిల్లాల్లో అలర్ట్
Advertisement

UP Killer Storm: యూపీలో గాలి వానలు బీభత్సం సృష్టించాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీయడంతో ఏళ్లు తరబడిన చెట్లు నేలకూలాయి. ఎలాంటి హెచ్చరిక లేకుండా భయంకరమైన పిడుగులు భూమిని తాకాయి. ఫలితంగా 74 మంది మృతి చెందారు. 38 జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ బీభత్సం ఇంకా కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.

యూపీలో ప్రకృతి కన్నెర్ర..  గాలి-వానలు, ఆపై పిడుగులు బీభత్సం

Advertisement

ఉత్తరప్రదేశ్‌ బుధవారం ప్రకృతి కన్నెర్ర చేసింది. భీకరమైన గాలులు, ఓ వైపు భారీ వర్షం.. ఇంకో వైపు పిడుగులు ఫలితంగా పెను విషాదాన్ని నింపాయి. యూపీ వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ప్రకృతి బీభత్సానికి ఇప్పటివరకు 74 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు. ఇక ఆస్తి నష్టం గురించి చెప్పనక్కర్లేదు.

భారీగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బలమైన గాలులకు తోడు పిడుగు, చెట్లు విరిగిపడడం ఈ మరణాలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అత్యధికంగా ప్రయాగ్‌రాజ్ జిల్లాలో 17 మంది మృతిచెందారు. భదోహి-16, మీర్జాపూర్-10, ఫతేపూర్-9 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

వివిధ జిల్లాల్లో  74 మంది మృతి.. 38 జిల్లాలను అలర్ట్ చేసిన అధికారులు

చాలా జిల్లాల్ ఇదే పరిస్థితి నెలకొని ఉందని, ఇప్పుడున్న మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులకు ఏళ్ల తరబడిన చెట్లు సైతం నేల కూలాయి. ఫలితంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. ఇక విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థల గురించి చెప్పనక్కర్లేదు.

గాలుల ధాటికి విద్యుత్ లైన్లు ఎక్కడికక్కడ తెగిపడ్డాయి. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో రాత్రి వేళ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మొబైల్ టవర్లు దెబ్బతినడంతో కమ్యూనికేషన్ వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ALSO READ: ఇస్రో బాహుబలి మళ్ళీ వస్తోంది.. నింగిలోకి GSLV-F17.. ఈసారి గురి తప్పేదే లే!

ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. పెంకుటిళ్లు, గుడిసెలు బలమైన గాలులకు ఎగిరిపోవడం, కుప్పకూలడం జరిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాగ్‌రాజ్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఐదు మండలాల్లో 17 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. ఇక పశువుల మాట చెప్పనక్కర్లేదు.

గాలి వానల దాటికి నిమిషాల వ్యవధిలో పలు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ప్రయాగ్‌రాజ్ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఐదు మండలాల్లో 17 మరణాలు నమోదయ్యాయి. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పిల్లలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారు. ఇక పశువుల మాట చెప్పనక్కర్లేదు. గాలి వానల దాటికి నిమిషాల వ్యవధిలో పలు కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇలా ఏ జిల్లా చూసినా ఇదే పరిస్థితి కనిపించింది.

రాబోయే నాలుగైదు గంటల్లో భారీ వర్షాలతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు సూచించారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. లక్నో, ప్రయాగ్రాజ్, జౌన్‌పూర్, బండాతోపాటు మొత్తం 38 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Related News

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

Big Stories

Advertisement
×