E-Paper
Advertisement

ఇరిగేషన్ శాఖలో బదిలీల కలకలం.. ఆ రెండు విభాగాలనే ఎందుకు టార్గెట్..?

ఇరిగేషన్ శాఖలో బదిలీల కలకలం.. ఆ రెండు విభాగాలనే ఎందుకు టార్గెట్..?
Advertisement

Irrigation Transfers: స్వేచ్ఛ బ్యూరో: ఇరిగేషన్ శాఖలో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. ఉద్యోగుల జనరల్ బదిలీ కోసం ప్రభుత్వం జీవో 38 జారీ చేసినప్పటికీ దానికి అనుబంధంగా ఇరిగేషన్ శాఖ సర్క్యూలర్ జారీ చేసింది. ఆ సర్య్కూలర్ లో తొలిసారి ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ ఇంజనీర్లు బదిలీకోసం ఆప్షన్లు ఎంచుకోవాలని పేర్కొనడం గమనార్హం. అంటే ఈ రెండు విభాగాలకే చెందినవారిని ఎందుకు బదిలీ చేస్తున్నారనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే చర్చనీయాంశమైంది. మిగిలిన రెండు విభాగాలను ఎందుకు చేయడం లేదు.. అందులోని మతలబు ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ ప్రభుత్వ ఆదేశాల మేరకు బదిలీ నిర్ణయం తీసుకున్నారా? లేదా? అనే ప్రచారం జరుగుతుంది.

ఈ నెల 12న సర్య్కూలర్ జారీ..

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీల కోసం కామన్ జీవో 38 జారీ చేసింది. అన్నిశాఖల్లో బదిలీలకు అనుమతి ఇచ్చింది. అయితే ఇరిగేషన్ శాఖసైతం ఈ జీవోకు నీటిపారుదలశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్(అడ్మినిస్ట్రేషన్) కార్యాలయం ఈ నెల 12న సర్య్కూలర్ జారీ చేసింది. అయితే అందులో రాష్ట్రంలోని వివిధ మల్టీజోన్లలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగాలకు చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు ఈ బదిలీలకు అర్హులుగా పేర్కొంది. అయితే అసలు మతలబు ఇక్కడే మొదలైంది. ఇరిగేషన్ శాఖలో అగ్రికల్చర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లు ఇలా నాలుగు విభాగాలకు చెందిన వారు పనిచేస్తున్నారు. అయితే సివిల్, మెకానిక్ ఇంజనీర్లను ఎందుకు మినహాయింపు ఇచ్చారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది.

ఆన్ లైన్‌లో ఆప్షన్లు..

Advertisement

ఒకే స్టేషన్ లో పనిచేయడానికి ఉండాల్సిన కనీస లేదా గరిష్ట సేవాకాల పరిమితి నిబంధన లేకుండా బదిలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు సర్య్క్యూలర్ లో పేర్కొన్నారు. అర్హులైన ఇంజనీర్లు తమకు నచ్చిన పంపు హౌజ్ డివిజన్లు, సబ్ డివిజన్లు లేదా అగ్రికల్చర్ డివిజన్లను ఎంచుకోవడానికి అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని, ఆన్ లైన్ ఆప్షన్లు పూర్తి చేసిన తర్వాత సంబంధిత ఉద్యోగులు ఆఫారాన్ని డౌన్ లోడ్ చేసుకొని సంతకం చేసి తమ పరిధిలోని యూనిట్ ఆఫీసులో అందజేయాలని వెల్లడించారు. ఈ నెల 18లోగా ఆయా యూనిట్ అధికారులు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ఫారాలను ప్రధానకార్యాలయానికి పంపాలని ఇంజనీర్ ఇన్ చీప్ (అడ్మిషన్) స్పష్టంగా పేర్కొన్నారు.

Also Read: ఇంట్లో చేసిన వెజ్ కర్రీ అంతా మిగిలిపోయిందా? 3 టేస్టీ డిషెస్ ఇలా చేయండి

ప్రస్తుతం కొత్త నిబంధనలు

Advertisement

ఇది ఇలా ఉంటే ఇతర విభాగాల ఇంజనీర్లకు లేని నిబంధనలు అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు ఎందుకు పెట్టారనేది ఇప్పుడు చర్చకు దారితీసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లలో గానీ, ఉద్యోగ బాధ్యతలు చేపట్టే సమయంలోగానీ, ఇంజనీరింగ్ సర్వీస్ రూల్స్ లోగానీ ఫలానా వాళ్లు.. ఫలానా బాధ్యతలే చేపట్టాలనే నిబంధనలు లేవు. నాలుగు విభాగాలకు చెందినవారు శాఖ హెడ్ ఆఫీసులో, వాలంతరిలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతం కొత్త నిబంధనలను తెరమీదకు తేవడం.. అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ విభాగంకు చెందిన ఇంజనీర్లు కేవలం పంపు హౌజ్ డివిజన్లు, సబ్ డివిజన్లు, అగ్రికల్చర్ డివిజన్లలో పనిచేసేందుకు ఆప్షన్లు ఎంచుకోవాలని సర్క్యూలర్ ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు విస్తృత చర్చజరుగుతుంది. శాఖ హెడ్ ఆఫీసులో పనిచేస్తే ఇతర విభాగాలకు చెందినవారికి ప్రమోషన్లలో కాంపీటేషన్ అవుతారనా? లేకుంటే ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా? అనేది హాట్ టాపిక్ అయింది.

ఈ రూల్స్ ప్రకారం..

2018లో తెలంగాణ నీటిపారుదల ఇంజనీరింగ్ సర్వీస్ రూల్స్ పేరుతో ప్రత్యేక నిబంధనలకు రూపకల్పన చేస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 32 ద్వారా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రూల్స్ ప్రకారం శాఖలోని పోస్టుల వర్గీకరణ, నియామక ప్రక్రియలు, ప్రమోషన్ల అర్హతలను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. 6 కేటగిరీలుగా విభజన చేసింది. అందులో ఇంజనీర్-ఇన్ చీఫ్, చీఫ్ ఇంజనీర్, సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ గా పేర్కొంది. పదోన్నతులకు కావల్సిన కనీస సర్వీస్ ను అందులో స్పష్టంగా వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఇచ్చిన ఉద్యోగుల బదిలీ జీవో చర్చకుదారితీసింది.

ఇంజనీర్-ఇన్ చీఫ్(అడ్మిన్) నిర్ణయమా?

ఇరిగేషన్ శాఖలో ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగాల్లో సుమారు 200లకు పైగా పనిచేస్తున్నారు. అయితే పబ్లిక్ సర్వీసు కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ లో గానీ, జీవో లోగానీ, ఉద్యోగ సర్వీసుల్లో గానీ.. ఈ రెండు విభాగాలకు చెందిన ఇంజనీర్లు పంపుహౌజ్, అగ్రికల్చర్ డివిజన్లలో పనిచేయాలనే నిబంధనలు లేవు. కానీ ఇంజనీర్ ఇన్ చీఫ్ (అడ్మిన్) ఇచ్చిన బదిలీల్లో మాత్రం ఈ రెండు విభాగాలకు చెందిన ఇంజనీర్లను టార్గెట్ చేశారనేది ఇప్పుడు చర్చజరుగుతుంది. ఇంజనీర్ అసోసియేషన్ కు చెందిన ఓ నేత చక్రం తిప్పారని, అందుకే ఈ రెండు విభాగాలకు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో, వాలంతరిలో గానీ పనిచేస్తున్న వారిని అక్కడి నుంచి పంపించే కుట్రలో భాగమే ఈ సర్య్కూలర్ జారీ చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈఎన్సీ(అడ్మిన్) ఏక పక్ష నిర్ణయం తీసుకున్నారని, నిబంధనలను తుంగలో తొక్కి ఈ సర్క్యూలర్ జారీ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ఆవేదన వ్యక్తం..

ఈ జీవో జారీకి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లు సమాచారం. అయితే ఈఎన్సీ అనుమతి తీసుకున్నారా? లేక ఇరిగేషన్ శాఖ సెక్రటరీ అనుమతి తీసుకున్నారా? లేక సొంతంగానే ఈ రెండువిభాగాలకు చెందినవారిని బదిలీకి నిర్ణయం తీసుకున్నారా? అనేది ఇప్పుడు ఉద్యోగుల్లోనే హాట్ టాపిక్ గా మారింది. కనీసం ఉద్యోగుల అభిప్రాయం కూడా జీవో జారీ సమయంలో తీసుకోలేదని, మాకు అన్యాయం చేస్తున్నారని పలువురుఎలక్ట్రికల్, అగ్రికల్చర్ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని తమపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటంతో భాగంగానే ఈ జీవో తీసుకొచ్చారని ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందా? శాఖ మంత్రిలేదా? శాఖ ఉన్నతాధికారులు స్పందిస్తారా? లేదా అనేది చూడాలి.

Also read: రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. 14 రకాల పంటలకు మద్దతు ధర పెంపు..!

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×