E-Paper
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ

Uttarakhand  Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. విష్ణుగడ్-పీపల్‌కోటి ప్రాంతంలో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన సొరంగంలో అర్ధరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీకొన్నాయి. కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఓ రైలు.. మెటీరియల్‌తో వస్తున్న మరో రైలుని ఢీ కొట్టింది.

ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం

Advertisement

ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగానే గాయపడినట్టు తెలుస్తోంది. మోనో రైళ్లు ఢీకొన్న సమయంలో ఓ రైలులో 109 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత గట్టిగా కేకలు పెట్టారు. సొరంగం లోపల అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు గందరగోళానికి గురయ్యారు కార్మికులు.

ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. 10 మందిని గోపేశ్వర్‌లో జిల్లా ఆసుపత్రికి, 17 మందిని పీపల్‌కోటిలోని వివేకానంద ఆసుపత్రికి అంబులెన్సుల్లో తరలించారు. మిగతావారికి టన్నెల్ బయటకు ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. మోనోరైలులో ఒకదాని బ్రేకులు ఫెయిల్ కావడంతో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు ఆ ప్రాంతంలోని అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement

ఢీ కొన్న రెండు లోకోమోటివ్ రైళ్లు 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. పొడవైన సొరంగాల్లో కార్మికులు-మెటీరియల్‌ను తీసుకెళ్లడానికి లోకోమోటివ్ రైళ్లను ఉపయోగిస్తుంటారు.

సిగ్నల్ లోపమో, లేక మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలీదు. అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్యంతో విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది నిర్మాణ కంపెనీ. అంతలోనే ఈ ఘటన జరిగింది.

ALSO READ:  జపాన్ ను అధిగమించిన భారత్.. ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థ మనదే

 

 

Related News

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

ఈ నెలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. ఆ రెండు అంశాలపై వాడీ వేడీ రచ్చ!

ఢిల్లీలో వీడని సస్పెన్స్.. అభిజిత్ దీప్కే ఆచూకిపై గందరగోళం.. నేహా బోరా తీవ్ర ఆరోపణలు!

బీజేపీ అగ్రనేతకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిన ఎల్.కే. అద్వానీ.. ప్రస్తుతం ఎలా ఉన్నారంటే?

Big Stories

Advertisement
×