E-Paper
Advertisement

దేశంలో మరో పేపర్ లీకేజ్ కలకలం.. రెండు పరీక్షలు రద్దు, అసలేం జరిగింది?

దేశంలో మరో పేపర్ లీకేజ్ కలకలం.. రెండు పరీక్షలు రద్దు, అసలేం జరిగింది?
Advertisement

Paper Leak: దేశంలో పరీక్షా పేపర్ల లీకేజీల పరంపర ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (UTU)లో చోటుచేసుకున్న పేపర్ లీక్ ఘటన విద్యార్థుల భవిష్యత్తుపై మరోసారి మబ్బులు కమ్ములుకునేలా చేసింది. ఎంతో భవిష్యత్తు ఉంటుందని ఆశపడి ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఈ వార్త గొడ్డలిపెట్టులా మారింది. రెండు సెమిస్టర్లకు సంబంధించిన ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందే సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది.

వాట్సాప్ గ్రూప్‌లో క్వశ్చన్ పేపర్లు.. ప్రొఫెసరే సూత్రధారి!
పరీక్షలు పారదర్శకంగా జరగాల్సిన చోటే అక్రమాలు చోటుచేసుకోవడం గమనార్హం. యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్ సెమిస్టర్ ప్రశ్నపత్రాలు హఠాత్తుగా వాట్సాప్ గ్రూపుల్లో దర్శనమిచ్చాయి. అయితే ఈ లీకేజీ వెనుక వేరే ఎవరో లేరని, స్వయంగా యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశిష్ కుమార్ గుప్తానే ఈ కుట్రకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. విద్యార్థులకు మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే ఇలా పేపర్లు లీక్ చేసి వాట్సాప్‌లో షేర్ చేయడంపై విద్యార్థి లోకం, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

పోలీసు కేసు నమోదు.. వర్సిటీ కఠిన నిర్ణయం!
ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే యూనివర్సిటీ యంత్రాంగం వేగంగా స్పందించింది. లీకేజీకి ప్రధాన కారకుడిగా భావిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆశిష్ కుమార్ గుప్తాపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ లీకేజీ వెనుక ఇంకా ఎవరైనా హస్తం ఉందా? డబ్బులు చేతులు మారాయా? అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

పరీక్షలు రద్దు.. విద్యార్థులకు మళ్లీ టెన్షన్!
పేపర్ లీక్ అయినట్లు నిర్ధారణ కావడంతో, విద్యార్థుల కష్టాన్ని పరిగణనలోకి తీసుకుని యూనివర్సిటీ యాజమాన్యం ప్రస్తుతం జరుగుతున్న సెమిస్టర్ పరీక్షలను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. రద్దయిన ఈ పరీక్షలను ఆగస్టు 3వ వారంలో తిరిగి నిర్వహించనున్నట్లు సమాచారం అందించింది. రాత్రింబవళ్లు కష్టపడి చదివిన నిజాయితీపరులైన విద్యార్థులు ఈ రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు ఇటువంటి లీకేజీలపై శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: అమరావతిలో కుంకీ ఏనుగులకు పవన్ కల్యాణ్ ఘన స్వాగతం.. మన్యం బాధితులకు బిగ్ రిలీఫ్

Related News

మోదీ ప్రభుత్వం వారిని శత్రువులుగా చూస్తోంది.. పోలీసు చర్యలను ఖండించిన సోనియాగాంధీ

ఢిల్లీ విద్యార్థుల ఉద్యమానికి సల్మాన్ ఖాన్ మద్దతు.. దయచేసి ఆ ఒక్క పని చేయొద్దు!

రీల్ కాస్త రియల్ లైఫ్.. ఓ యువకుడి పెళ్లాడిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు, ఆ ఒక్క కారణంతో- వీడియో వైరల్

26 రోజుల పోరాటానికి సుఖాంతం.. దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్, అసలేం జరిగిందంటే?

యువత ఆందోళనలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరి.. వీడియో రిలీజ్ చేసిన ప్రధాని మోడీ, రాహుల్‌గాంధీ స్ట్రాంగ్ కౌంటర్

కాక్రోచ్ పోస్ట్ రగడ.. చిక్కుల్లో RAF ఆఫీసర్ సోనియా సెహ్రావత్!

నిరసనల ఎఫెక్ట్.. దిల్లీ పోలీసులకు స్పెషల్ పవర్స్.. అమల్లోకి జాతీయ భద్రతా చట్టం!

Big Stories

Advertisement
×