E-Paper
Advertisement

విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?

విశాఖ–బెంగళూరు వందే భారత్ స్లీపర్.. విజయవాడ మీదుగానేనా?
Advertisement

Visakhapatnam–Bengaluru Vande Bharat Sleeper: ఏపీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం–బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు సేవకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వస్తోంది. ఈ రైలును ప్రారంభించే ప్రతిపాదన ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు రైల్వే వర్గాల్లో చర్చ జరుగుతోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే దసరా పండుగ సమయానికి ఈ కొత్త సర్వీస్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారుల సమాచారం.

విజయవాడ మీదుగా వందేభారత్ స్లీపర్

ఈ రైలు విజయవాడ మీదుగా నడిచేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే రూట్‌తో పాటు తాత్కాలిక షెడ్యూల్ కూడా సిద్ధమైనట్లు సమాచారం. అధికారిక ప్రకటన తర్వాత ప్రయాణ సమయాలు, స్టాప్‌లు, టికెట్ వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం విశాఖపట్నం నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణం చేసే వారికి ఎక్కువ సమయం పడుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు తరచూ ఈ మార్గంలో ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుందని భావిస్తున్నారు.

ఎవరికి ఎక్కువ ప్రయోజనం అంటే?

Advertisement

ఇప్పటికే దేశంలోని పలు ప్రధాన మార్గాల్లో వందే భారత్ రైళ్లు మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు స్లీపర్ వెర్షన్‌ను కూడా దశలవారీగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వేలు చర్యలు చేపడుతున్నాయి. ఈ రైళ్లలో ఆధునిక సౌకర్యాలు, సౌకర్యవంతమైన బెర్త్‌లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు, ఆధునిక ఇంటీరియర్ వంటి ప్రత్యేకతలు ఉండనున్నాయి. విశాఖపట్నం–బెంగళూరు స్లీపర్ వందే భారత్ రైలు ప్రారంభమైతే ఉత్తరాంధ్ర, మధ్య ఆంధ్ర ప్రాంతాల ప్రయాణికులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయవాడ మీదుగా నడిస్తే రెండు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు కూడా ఈ సేవను సులభంగా వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

దసరా నాటికి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం!

అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ రైల్వే శాఖ నుంచి అధికారిక ప్రకటన చేయలేదు. రూట్, షెడ్యూల్, ప్రారంభ తేదీ లాంటి అంశాలపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. దసరా సమయానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ రైలు ప్రారంభమైతే విశాఖపట్నం–బెంగళూరు మధ్య ప్రయాణించే వేలాది మంది ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన మరో కొత్త ఎంపిక అందుబాటులోకి రానుంది. అందుకే ఈ ప్రతిపాదనపై ప్రయాణికుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అందరి దృష్టి భారతీయ రైల్వే అధికారిక ప్రకటనపైనే ఉంది. అదే సమయంలో ఏ మార్గంలో ఈ రైలు నడిస్తే బాగుంటుందనే విషయంలోనూ ప్రజలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితేచ రైల్వే ఏ నిర్ణయం తీసుకుంటుందనేది త్వరలోనే తెలియనుంది.

Advertisement

Read Also: 12 స్టేషన్లు.. 320 కి.మీ స్పీడ్.. బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారు!

Related News

విమాన సంస్థపై ఆ ట్రావెలర్ ఆగ్రహం.. 5 వేలు ఇచ్చినందుకా? అసలేం జరిగింది?

నల్లగొండలో వైజాగ్ కాలనీ కనువిందు.. సాగర్ బ్యాక్‌ వాటర్స్ నేచర్ మ్యాజిక్ చూసొద్దాం రండి!

దేశంలో అడ్వెంచర్ టూరిజంకు పెరుగుతున్న ఆదరణ.. కొండలు, దట్టమైన అడవుల్లో సాహస యాత్రకు బెస్ట్ స్పాట్స్ ఇవే

క్వీన్ ఆఫ్ హిల్స్ ‘ముస్సోరీ’.. తప్పక చూడాల్సిన 7 టాప్ టూరిస్ట్ స్పాట్స్!

బీచ్ లవర్స్ కోసం పాండిచ్చేరి స్పెషల్.. బడ్జెట్, బ్యూటీ కలగలిపిన 5 హాట్‌స్పాట్స్!

రూ.10వేలలోపే యూరప్ వైబ్స్! ఇండియాలోని ఈ ప్లేస్‌లు అస్సలు మిస్ అవ్వొద్దు!

మాన్‌సూన్ వైబ్స్.. పుణేకి దగ్గర్లో ఉన్న 5 అద్భుతమైన హిడెన్ వాటర్‌ఫాల్స్ ఇవే!

Big Stories

Advertisement
×