E-Paper
Advertisement

త్రిష బర్త్ డే స్పెషల్… విశ్వంభర నుంచి ఫస్ట్ లుక్ రివీల్..భలే సింక్ చేశారే?

త్రిష బర్త్ డే స్పెషల్… విశ్వంభర నుంచి ఫస్ట్ లుక్ రివీల్..భలే సింక్ చేశారే?
Advertisement

Vishwambhara: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒకానొక సమయంలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి త్రిష(Trisha) ఒకరు. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ సినిమా అవకాశాలు రావడం విశేషం. ప్రస్తుతం ఈమె తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇక త్రిష తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విశ్వంభర అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

త్రిష బర్త్ డే స్పెషల్..

ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కేవలం విఎఫ్ఎక్స్ పనులు పూర్తికాని నేపథ్యంలో ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ సినిమా జూన్ పదో తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి అధికారక ప్రకటన తెలియజేయనున్నారు.. ఇకపోతే నేడు (మే 4) త్రిష తన పుట్టినరోజు(Trisha Birthday)ను జరుపుకుంటున్న నేపథ్యంలో విశ్వంభర (Vishwambhara) సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమాలో త్రిష అవని అనే పాత్రలో నటించబోతున్నట్టు ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వెల్లడించారు.

Advertisement

తమిళనాడు ఎన్నికలలో విజయ్ విజయం..

వశిష్ట దర్శకత్వంలో యు వి క్రియేషన్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో త్రిష ఫస్ట్ లుక్ పోస్టర్ లో భాగంగా ఈమె చేతిలో దీపాలు ఉన్నటువంటి పళ్లెం పట్టుకొని కనిపిస్తున్నారు దీంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ ఫోటో పై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నేడు తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలలో నటుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.

Advertisement

ఇలా విజయ్ మంచి మెజారిటీ సాధించడంతో త్రిష ఆయనకు హారతి పడుతూ స్వాగతం పలుకుతున్నట్టుగా ఈ ఫోటో ఉందని, సరైన సమయానికి మేకర్స్ అద్భుతమైనటువంటి పోస్టర్ విడుదల చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే నెటిజన్స్ ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడానికి కారణం లేకపోలేదు. హీరో విజయ్ తో త్రిష రిలేషన్ లో ఉన్నారు అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు అనుగుణంగానే హీరో విజయ్ భార్య సంగీత కూడా ఆయన నుంచి విడాకులు కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే త్రిష, విజయ్ రిలేషన్ కి సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక నేడు విజయ్ గెలవడంతో త్రిష పేరు కూడా ట్రెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: నేను సీఎం అవుతా త్రిష కోరిక నెరవేరినట్టేనా..వైరల్ అవుతున్న వీడియో!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×