Keralam Politics: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తర్వాత ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్నాయి. బెంగాల్, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కొత్త ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. కేరళంలో మాత్రం నేడో రేపో ఓ కొలిక్కి రానుంది. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యద్ధం మొదలైంది.
కేరళం చుట్టూ కొత్త రాజకీయాలు..
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిలో రేసులో ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల, వీడీ సతీషన్ వంటి నేతలు పోటీ పడుతున్నారు. దీంతో ముఖ్యమంత్రిని ఎంపిక చేయడం కాంగ్రెస్ హైకమాండ్‌కు కత్తి మీద సాముగా మారింది.
కేరళం సీఎం ఎంపిక ఆలస్యం కావడంతో కాంగ్రెస్-బీజేపీల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. సీఎం ఎంపిక ప్రక్రియ తాము వేగంగా చేస్తామని బీజేపీ అంటే.. లేదు లేదు తామే త్వరగా పూర్తి చేశామంటోంది కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు తక్కువ సమయంలో ముఖ్యమంత్రులను ఎంపికను ఎవరు వేగంగా చేశారు? అన్నదానిలోకి ఒక్కసారి వెళ్లొద్దాం.
సీఎం ఎంపికపై కాంగ్రెస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం
అత్యధికంగా ఐదు నుంచి తొమ్మిది రోజుల్లో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఇక ఏడు రోజుల నుంచి 15 రోజుల్లో సీఎం ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన ఘటన బీజేపీకి సొంతం. కేరళ విషయంలో సరిగ్గా తొమ్మిది రోజున నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా 9 రోజుల్లో రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లుగా బీజేపీ,దాని అనుకూల మీడియా రాద్ధాంతం చేస్తున్నాయి.
2000 ఏడాది నుంచి రెండు పార్టీల రికార్డులను గణాంకాలను ఒక్కసారి పరిశీలిద్దాం. కాంగ్రెస్ పార్టీ సగటున ముఖ్యమంత్రి ఎంపికకు కేవలం ఐదు రోజులు మాత్రమే తీసుకుంది. గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ 9 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోలేదని చరిత్ర చెబుతోంది. 22 ఏళ్ల సమయంలో 14 సార్లు 5 రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ముఖ్యమంత్రిని నియమించింది.
ఇక బీజేపీ విషయానికి వద్దాం. 2000 సంవత్సరం నుండి ఇప్పటివరకు పరిశీలిస్తే.. ముఖ్యమంత్రి ఎంపికకు సగటున 7.2 రోజులు తీసుకుంది. అత్యధికంగా ఆలస్యం చేసిన వాటిలో యూపీలో సీఎం ఎంపిక. 2022లో సీఎం యోగి ఎంపిక కోసం ఏకంగా 15 రోజులు సమయం తీసుకుంది. 30 ఏళ్లలో 13 సార్లు 8 రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంది బీజేపీ.
ALSO READ: కేరళ సీఎం అభ్యర్థిపై వీడని సస్పెన్స్..
2002లో పంజాబ్ సీఎంగా అమరీందర్ సింగ్ ఎంపికకు కేవలం 2 రోజులు సమయం పట్టింది. హిమాచల్ ప్రదేశ్ 2022లో సుఖ్వీందర్ సింగ్ సుఖు ఎంపికకు 3 రోజులు సమయం పట్టింది. తెలంగాణలో 2023 ఏడాది సీఎంగా రేవంత్ రెడ్డి ఎంపికకు కేవలం 4 రోజులు తీసుకుంది. 2004 ఏడాది ఉమ్మడి ఏపీలో వైఎస్ఆర్ ఎంపికకు కేవలం 3 రోజులు పట్టింది.
అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే 2023 డిసెంబర్‌లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకే రోజు వచ్చాయి. ఆనాడు ముఖ్యమంత్రి పేరును ఖరారు చేయడానికే బీజేపీ 10 నుండి 12 రోజుల సమయం తీసుకున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పుడు మీడియా మౌనం వహించిందని కాంగ్రెస్ నేతల మాట.