E-Paper
Advertisement

ఆ హీరోలకు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా అదే – ఉదయభాను

ఆ హీరోలకు, బాలయ్యకు మధ్య ఉన్న తేడా అదే – ఉదయభాను
Advertisement

Udaya Bhanu: ఒకప్పుడు బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా వెలిగిన ప్రముఖ యాంకర్ ఉదయభాను చాలా కాలం తర్వాత మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఇటీవల ‘పంచనామా’ అనే వెబ్ సిరీస్‌తో నిర్మాతగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన ఆమె వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటసింహం నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు గురించి, ఇండస్ట్రీలోని కొందరు హీరోల ప్రవర్తన గురించి ఉదయభాను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి ..

ఆటిట్యూడ్ చూపించే హీరోలు :

సినిమా ఇండస్ట్రీలో ఉండే కొందరు హీరోల వైఖరిపై ఉదయభాను విమర్శలు గుప్పించారు. ఈమధ్య కాలంలో కొంతమంది చిన్న హీరోలు కూడా ఎక్కడ పలకరించాల్సి వస్తుందో అని, చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మర్యాద లేకుండా ఆటిట్యూడ్ చూపించేవారు ఉన్న ఈ పరిశ్రమలో, అంత పెద్ద స్టార్ అయి ఉండి కూడా బాలయ్య ప్రవర్తించే తీరు ఎంతో గొప్పదని కొనియాడారు.

ఫోన్ తీయని సెలబ్రిటీలు:

Advertisement

తన కవల పిల్లల మొదటి పుట్టినరోజు వేడుకల సమయంలో జరిగిన ఒక సంఘటనను ఉదయభాను గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ఈ వేడుకను జరుపుకోవాలని భావించి చాలామంది సెలబ్రిటీలకు ఫోన్ చేయగా, ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఇక తీవ్ర నిరాశకు గురైన సమయంలో చివరి ప్రయత్నంగా బాలకృష్ణకు ఫోన్ చేసినట్టు ఆమె చెప్పారు.

మాట ఇచ్చిన దేవుడు బాలయ్య :

ఇక మొదట ఫోన్ లిఫ్ట్ చేయలేదు,తరువాత అరగంటలోనే బాలయ్య స్వయంగా ఫోన్ చేసి, పిల్లల బర్త్ డేకి కచ్చితంగా వస్తానని మాట ఇచ్చారని ఉదయభాను తెలిపారు. చెప్పినట్లే, వేరే ప్రాంతంలో ముందే అనుకున్న ముఖ్యమైన మీటింగ్ ఉన్నప్పటికీ, దానిని త్వరగా ముగించుకుని కరెక్ట్ సమయానికి ఇంటికి వచ్చారు. ఇక ఆ క్లిష్ట సమయంలో బాలకృష్ణ తనకు ఒక దేవుడిలా కనిపించారని ఆమె ఎమోషనల్ అయ్యారు.

Advertisement

also read: వేణుమాధవ్ తో నాకున్న బంధం అదే.. ఆఖరి రోజుల్లో ఏం అన్నాడంటే – ఉదయభాను

స్టార్‌డమ్ మరచి నవ్వుల పువ్వులు:

మామూలుగా సెలబ్రిటీలు ఇలాంటి వేడుకలకు వస్తే ఐదారు నిమిషాలు ఉండి వెళ్ళిపోతుంటారు. కానీ బాలయ్య మాత్రం దాదాపు 45 నిమిషాల పాటు ఇంట్లోనే ఉండి, అందరితో చాలా సరదాగా గడిపారు. అక్కడ ఉన్న వారందరితో ఓపికగా నవ్వుతూ ఫొటోలు, సెల్ఫీలు ఇచ్చారని, ఆయన లాంటి మనసున్న వ్యక్తులు సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారని ఉదయభాను ప్రశంసల వర్షం కురిపించారు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి బాలకృష్ణ నిలువెత్తు నిదర్శనమని ఉదయభాను మాటలు నిరూపిస్తున్నాయి. స్టార్‌డమ్ తలకు పట్టుకొని ప్రవర్తించే ఈ రోజుల్లో, తోటి నటీనటుల పట్ల, చిన్న కళాకారుల పట్ల బాలయ్య చూపే ఆప్యాయత, ఇచ్చిన మాటకు కట్టుబడే నైజమే ఆయనను అందరి దృష్టిలో ‘బంగారు మనసున్న హీరో’గా నిలబెట్టాయి.

Related News

యాంకర్ సుమతో గొడవలు.. అసలు విషయం చెప్పిన ఉదయభాను

పొలిటికల్ ఎంట్రీ పై ఉదయభాను క్లారిటీ… పోరాటం చేయాల్సిందే అంటూ!

నంది అవార్డుకు కులం అడ్డొచ్చిందా? ఇండస్ట్రీ పాలిటిక్స్ పై ఉదయభాను కామెంట్స్!

వేణుమాధవ్ తో నాకున్న బంధం అదే.. ఆఖరి రోజుల్లో ఏం అన్నాడంటే – ఉదయభాను

మహా నెలకు అంత సంపాదిస్తుందా..? సీరియల్ కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి వార్నింగ్.. శృతి ఫుల్ హ్యాపీ.. బాలుకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను ఇంటికి రమ్మన్న కార్తీక్         

Big Stories

Advertisement
×