E-Paper
Advertisement

కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!

కీప్యాడ్ ఫోన్‌లో ఇలాంటి ఫీచర్లు అరుదే.. 2500mAh బ్యాటరీతో iTel Music 450L లాంచ్!
Advertisement

Itel Muzik 450L: స్మార్ట్‌ఫోన్‌లు ఎంతగా అందుబాటులోకి వచ్చినా.. కీప్యాడ్ ఫోన్లకు ఉన్న డిమాండ్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, సింపుల్ యూసేజ్, మ్యూజిక్ వంటి ఫీచర్లు కోరుకునేవారు వీటిని సెకండ్ ఫోన్‌గా ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ యూజర్లను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ కొత్తగా ‘మ్యూజిక్ 450ఎల్’ కీప్యాడ్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్న ఈ ఫోన్‌లో ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

ఏడాది వారెంటీ:

చూడటానికి సింపుల్‌గా, ట్రెడిషనల్ కీప్యాడ్ ఫోన్ డిజైన్‌తో ఐటెల్ మ్యూజిక్ 450ఎల్ ఆకట్టుకుంటుంది. చేతిలో సులభంగా పట్టుకునే విధంగా రూపొందించిన ఈ ఫోన్ ధర రూ.1,659గా ఉంది. బ్లూ, గ్రీన్, బ్లాక్ వంటి మూడు కలర్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఫోన్‌తో పాటు ప్రొటెక్టివ్ బ్యాక్ కవర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. కొనుగోలు చేసిన వారికి ఏడాది కౌంటర్ రీప్లేస్‌మెంట్ వారంటీని అందిస్తున్నారు.

బిగ్ బ్యాటరీ, టైప్-C ఛార్జింగ్:

Advertisement

కీప్యాడ్ ఫోన్లను ఉపయోగించేవారిలో ఎక్కువగా కనిపించే అవసరాల్లో బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకటి. దీనిని దృష్టిలో పెట్టుకుని ఐటెల్ మ్యూజిక్ 450ఎల్‌లో 2500mAh కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందించారు. సాధారణ వినియోగంలో తరచూ ఛార్జర్ కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. పాత తరహా ఛార్జింగ్ పోర్ట్‌కు బదులుగా USB Type-C కనెక్టివిటీని ఇవ్వడం మరో ప్లస్ పాయింట్. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టైప్-C ఛార్జర్లతో ఫోన్‌ను సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

డ్యూయల్ స్పీకర్లు:

Advertisement

పేరు సూచించినట్లుగానే మ్యూజిక్ విషయంలో ఈ ఫోన్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఐటెల్. ఇందులో 2-in-1 F20 స్పీకర్లను అందించారు. ఇవి మంచి వాల్యూమ్‌తో ఆడియోను అందించడంతో పాటు పాటలు వినేటప్పుడు క్లియర్ సౌండ్‌ను అందించేలా రూపొందించారు. ఎఫ్‌ఎం రేడియో వినేందుకు ఇయర్‌ఫోన్స్ అవసరం లేకుండా నేరుగా రేడియో వినే సదుపాయం కూడా ఉంది. నచ్చిన ఎఫ్‌ఎం కార్యక్రమాలు లేదా పాటలను రికార్డ్ చేసుకునే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. వీటితో పాటు వెనుక భాగంలో VGA కెమెరా, అవసరమైన సమయంలో ఉపయోగపడే టార్చ్ లైట్‌ను కూడా అందించారు.

ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్:

కీప్యాడ్ ఫోన్ అయినప్పటికీ.. కాలింగ్‌కు సంబంధించిన కొన్ని ఉపయోగకరమైన ఫీచర్లను ఐటెల్ ఇందులో ఇచ్చింది. ముఖ్యంగా కాల్స్‌ను ఆటోమేటిక్‌గా రికార్డ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే 1,000కి పైగా కాంటాక్ట్స్‌ను స్టోర్ చేసుకునే అవకాశం కల్పించారు. King Talker వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

సెకెండ్ ఫోన్‌గా వాడొచ్చు:

ఇక ఫోన్‌ను అన్‌లాక్ చేయకుండానే సమయం తెలుసుకోవాలంటే 0 బటన్‌ను కొద్దిసేపు ప్రెస్ చేస్తే సరిపోతుంది. వెంటనే సమయాన్ని వాయిస్ ద్వారా తెలియజేస్తుంది. మొత్తంగా చూస్తే.. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, మ్యూజిక్, ఎఫ్‌ఎం, సింపుల్ కాలింగ్ వంటి అవసరాలతో బడ్జెట్‌లో కీప్యాడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఐటెల్ మ్యూజిక్ 450ఎల్‌ ఉత్తమ ఎంపికగా చెప్పవచ్చు.

Also Read: యూపీఐ పేమెంట్స్ రూ.2,000 దాటితే ఛార్జీలా? కేంద్రం నుంచి వచ్చిన ఆఫీషియల్ అప్డేట్ ఇదే!

Tags

Related News

తెలివైన వాళ్ళు మాత్రమే..వాడే ఈ సేఫ్టీ మోడ్ గురించి మీకు తెలుసా?

బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు.. Moto Buds 2 Fusion ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు!

కొత్త ఫోన్ కొనేటప్పుడు ర్యామ్,ప్రాసెసర్,కెమెరా లేదా ఏది ముఖ్యం?

ఇంటిని డిస్కో థియేటర్‌లా మార్చేయండి! టాప్ 5 హై-పెర్ఫార్మెన్స్ ఎల్జీ సౌండ్‌బార్స్!

అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేస్తోన్న Samsung Galaxy Tab S12.. లాంచ్ డేట్ లీక్!

ల్యాప్‌టాప్‌లపై 40% డిస్కౌంట్..స్టూడెంట్స్ అస్సలు మిస్ కావద్దు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026..ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బు వేస్టే!

Big Stories

Advertisement
×