2024 Best Bollywood Web Series in jiocinema : ఓటిటి ప్లాట్ఫారం లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల జోరు కొనసాగుతోంది. ఈ వెబ్ సిరీస్లు కొన్ని ఎపిసోడ్స్ తో ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని వెబ్ సిరీస్ లలో ప్రతి ఎపిసోడ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లు ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటున్నాయి. 2024 లో ఓటిటి ప్లాట్ ఫామ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతున్న బాలీవుడ్ బెస్ట్ వెబ్ సిరీస్ ల గురించి తెలుసుకుందాం.
పిల్ (Pill)
పిల్ (Pill) ఇది ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో రితేష్ దేశ్ముఖ్, పవన్ మల్హోత్రా, అక్షత్ చౌహన్, విక్రం దరియా ప్రధాన పాత్రల్లో పోషించారు. జులై 12 2024 లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో స్ట్రీమింగ్ అవుతోంది. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
మర్డర్ ఇన్ మహీం (murder in Mahim)
ఈ వెబ్ సిరీస్ లో విజయ్ రాజ్, శివాని రఘువంశి, అసితోష్ రానా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ క్రైమ్ సస్పెన్స్ వెబ్ సిరీస్ కు రాజ్ ఆచార్య దర్శకత్వం వహించారు. మే 10 2024 లో జియో సినిమా (Jiocinima) లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. క్రైమ్ సస్పెన్స్ సిరీస్ ను చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఇది ఒక బెస్ట్ సిరీస్ అని చెప్పుకోవచ్చు.
శేఖర్ హోమ్ (Shekhar Home)
ఈ వెబ్ సిరీస్ లో కేకే మీనన్, రణవీర్ షోరే,రసిక దుగల్, కీర్తి కుళ్హరి ప్రధాన పాత్రల్లో నటించారు. బి బి సి స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి రోహన్ సిప్పి దర్శకత్వం వహించాడు. 2014 ఆగస్టు 14 న ఈ వెబ్ సిరీస్ ని జియో సినిమా (Jiocinima) లో స్ట్రీమింగ్ చేశారు. ఆరు ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.
రన్నీటి బాల్కోట్ అండ్ బియాండ్ (Ranneeti : Balakot & Beyond)
ఈ వెబ్ సిరీస్ లో ఆశి తోస్ రానా, ఆశిష్ విద్యార్థి, జిమ్మీ, లారా దత్త ప్రధాన పాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ కి సంతోష్ సింగ్ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 25 2024 లో జియో సినిమాలోకి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. 9 ఎపిసోడ్స్ తో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ బెస్ట్ వెబ్ సిరీస్ గా దూసుకుపోతోంది.
హనీమూన్ ఫోటోగ్రాఫర్ (Honeymoon photographer)
ఈ వెబ్ సిరీస్ లో ఆశానేగి, రాజీవ్ సిద్ధార్థ, అపేక్ష, సాహిల్ సలాదియా ప్రధాన పాత్రలు పోషించారు. అర్జున్ శ్రీ వాస్తవ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ వెబ్ సిరీస్, సెప్టెంబర్ 27 2024 నుంచి, ఆరు ఎపిసోడ్లతో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.