5000mAh Battery Mobiles : బెస్ట్ బ్యాటరీ ఫర్ఫామెన్స్ మెుబైల్స్ ఎన్నో తాజాగా అందుబాటులోకి వచ్చేశాయి. వీటిలో 5000mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చేసిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఏడాది లాంఛ్ అయ్యి టెక్ ప్రియులను అకట్టుకుంటున్నాయి. ఇక ఈ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.
Motorola Edge 50 5G – Motorola Edge 50 5G ధర రూ.28,299. ఇది 8GB RAM + 256GB స్టోరేజ్, 50MP + 13MP + 10MP ప్రైమరీ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 7 Gen 1 యాక్సిలరేటెడ్ ఎడిషన్ ప్రాసెసర్‌తో లాంఛ్ అయింది.
POCO X6 Neo 5G – POCO X6 నియో 5G 6.67 FHD+ AMOLED డిస్‌ప్లేతో రూ. 12,999కే అందుబాటులో ఉంది. ఇదిమీడియోటెక్ డైమెన్సిటీ 6080 6nm ఆక్టాకోర్ 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో వచ్చేసింది.
TECNO POVA 6 NEO 5G – TECNO POVA 6 NEO 5G ధర రూ. 13,999. ఇది 108MP అల్ట్రా క్లియర్ AI కెమెరా, D6300 పవర్‌ఫుల్ ప్రాసెసర్, ఐదేళ్ల లాగ్ ఫ్రీ ఫ్లూయెన్సీ, 5000 mAh బ్యాటరీ, ఇన్‌బిల్ట్ ఇన్‌ఫ్రారెడ్ తో తక్కువ ధరకే అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్ గా నిలిచింది.
Lava Agni 3 5G – లావా అగ్ని 3 5G ధర రూ.24,999. ఇది డ్యూయల్ AMOLED డిస్ ప్లే, డైమెన్సిటీ 7300X, 50MP ట్రిపుల్ AI కెమెరా, 66W ఫాస్ట్ ఛార్జ్, 5000 mAh బ్యాటరీతో వచ్చేసింది. Android 15,16తో పాటు 17 అప్‌గ్రేడ్‌లతో వచ్చేసింది. ఇందులో 6.78, 1.5K రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 3D కర్వ్డ్ AMOLED HDR డిస్‌ప్లే ఉన్నాయి.
Lava O3 – లావా O3 13 MP AI బ్యాక్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరా, 4 GB RAM + 64 GB స్టోరేజ్ను కలిగి ఉంది. ఇక 8 GB వరకూ RAM ను పెంచుకునే అవకాశం సైతం ఉంది. RAM, 10W టైప్ C పోర్టల్ 5000mAh బ్యాటరీకి సపోర్ట్ చేస్తుంది. ఇక 6.75 హెచ్‌డి డిస్ ప్లేతో రూ. 6,199కే అందుబాటులో ఉంది.
Samsung Galaxy M14 4G – Samsung Galaxy M14 4G రూ. 8,599కే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4GB + 64GB స్టోరేజ్, 50MP ట్రిపుల్ కెమెరా, 5000mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ అందుబాటులో ఉన్నాయి. UI 5.1 ప్లాట్‌ఫారమ్‌తో Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
POCO M6 5G – POCO M6 5G మెుబైల్ లో MediaTek డైమెన్సిటీ 6100 + 5G ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ + 18W ఫాస్ట్ ఛార్జింగ్, 50 MP AI డ్యూయల్ కెమెరా సిస్టమ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. ఇక ఈ మెుబైల్ తక్కువ ధరకే రూ. 7,999కే అందుబాటులో ఉంది.
Samsung Galaxy M05 – Samsung Galaxy M05 ధర రూ. 6,499. కంపెనీ HD+ రిజల్యూషన్‌తో 6.7 డిస్‌ప్లే, 50 MP హై రిజల్యూషన్ డ్యూయల్ కెమెరా, 8 MP ఫ్రంట్ కెమెరాతో వచ్చేసింది. ఇది C టైప్ 25 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000mAh బ్యాటరీతో వచ్చేసింది.
ALSO READ : రీఛార్జ్ చేయని సిమ్ వ్యాలిడిటీ ఎన్ని రోజులంటే..!