BigTV English

Chaitanya College: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ గోడపై రాతలు.. చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో వినూతన నిరసన!

Chaitanya College: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామంటూ గోడపై రాతలు..  చైతన్య గర్ల్స్ క్యాంపస్‌లో వినూతన నిరసన!

Chaitanya College: చదువుల ఒత్తిడి భరించలేకున్నాం… తాము ఇక్కడ ఉండలేమంటున్న మియాపూర్‌లోని చైతన్య గర్ల్స్‌ క్యాంపస్‌ విద్యార్థినిలు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామంటూ గోడ మీద రాతలు రాశారు. దీనిని చూసిన యాజమాన్యం.. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తాము ఇంటి వెళ్లిపోతామంటుని వారు చెబుతున్నట్లు తెలుస్తోంది. క్యాంపస్‌లో మొత్తం 15 వందల మంది ఉండగా.. 12 వందల మంది ఇంటికి వెళ్లిపోయారు. మరో మూడు వందల మంది మాత్రమే ప్రస్తుతం హాస్టల్‌ ఉన్నారు. వీరు కూడా ఇంటికి వెళ్లిపోతామని చెబుతున్నట్లు సమాచారం. అయితే ఈ రాతలు చెరిపేసేందుకు కాలేజీ సిబ్బంది ప్రయత్నించారు.


అంతే కాదు మూడు రోజుల పాటు కాలేజీకి ఔటింగ్ ఇచ్చామని చెప్పి ఉద్యార్దులను ఉన్నపళంగా ఇంటికి పంపించేశారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కాలేజీ క్యాంపస్ ఎదుట ఆందోళనకు దిగారు. మంచిగా చదవులు చెబుతారని.. పిల్లలు భవిష్యత్తు బాంగుండాలని కాలేజీలో జాయిన్ చేస్తే.. యాజమాన్యం మాత్రం  పిల్లలను ఒత్తిడికి గురిచేస్తున్నారంటూ .. విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్ధులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

మాపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారు.. విద్యార్ధునిలు..


శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం, ప్రన్సిపల్ తమపై తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని విద్యార్ధునులు ఆందోళన చెందారు. నిత్యం చదువులు, మార్కులు అంటూ ర్యాష్‌గా వ్యవహరిస్తున్నారని కొంత మంది విద్యార్దనిలు చెబుతున్నారు. ఇదే కాలేజీలో ఇటీవల ఓ విద్యార్ధి ఒత్తిడి కారణంగానే బ్లేడ్‌తో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిందని.. గత కొద్దిరోజుల క్రితం మరో అమ్మాయి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయతినించిందని మీడియా ముందు వాపోయారు. ఇలా వరుస ఘటనలు తమను తీవ్ర ఆందోళకు గురిచేస్తున్నాయని విద్యార్ధునిలు కన్నీటి పర్యంతమయ్యారు.

Also Read: ఫామ్ హౌస్ పాలనకు విముక్తి.. ఏడాదైన ప్రజాపాలనపై టీపీసీసీ మాటల్లో

ఇదిలా ఉంటే.. సోమవారం నాడు మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలోని నారాయణ కాలేజీలో మరో ఆత్మహత్య ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తనూష్ అనే విద్యార్థి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. లెక్చరర్ వేధింపులతోనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కుషాయిగూడకు చెందిన తనూష్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. బూత్రూంలో ఉరి వేసుకొని తనూష్ చనిపోయాడు. డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×