BigTV English

OTT Movie : ముగ్గురితో ప్రేమ… అందం ఎరవేసి భర్తనే లేపించేసే భార్య.. ఈమె పెద్ద నెరజాణ గురూ!

OTT Movie : ముగ్గురితో ప్రేమ… అందం ఎరవేసి భర్తనే లేపించేసే భార్య.. ఈమె పెద్ద నెరజాణ గురూ!

OTT Movie : చూడడానికి అందంగా, అమాయకంగా కన్పించే ఓ అమ్మాయి భర్తను చంపింది అంటే నమ్మడం కష్టమే. కానీ ప్రియుడి మోజులో పడి ఇలా చేసిన అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. అలాంటి ఓ కిలాడీ లేడీకి సంబంధించిన స్టోరీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.


ఏ ఓటీటీలో ఉందంటే?
ఈ స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఏ విడోస్ గేమ్’ (A Widow’s Game). 2025 లో వచ్చిన ఈ సినిమాకి కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించారు. ఇది 2017లో స్పెయిన్‌లోని వాలెన్సియాలో జరిగిన నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ఇవానా బాక్వెరో, కార్మెన్ మాచి, ట్రిస్టన్ ఉల్లోవా ప్రధాన పాత్రల్లో నటించారు. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ స్టోరీ ఒక మర్డర్ చుట్టూ తిరుగుతుంది. ఈ హత్య కేసులో భార్య అనుమానితురాలిగా ఉంటుంది.

స్టోరీలోకి వెళితే
2017 ఆగస్టులో స్పెయిన్‌ లోని వాలెన్సియా నగరంలోని ఒక పార్కింగ్ ప్రాంతంలో ఒక వ్యక్తి శవం కనిపిస్తుంది. బాధితుడు ఆర్టురో ఫెర్రర్ ఒక ఇంజనీర్ గా ఉండేవాడు. ఒక సంవత్సరం క్రితం మాజే అనే యువతిని వివాహం చేసుకున్నాడు. మాజే పైకి సౌమ్యంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఆమె ఒక నర్సుగా పనిచేస్తుంటుంది. ఆమె భర్త హత్యపై తీవ్ర దుఃఖంలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే డిటెక్టివ్ ఈవా నేతృత్వంలోని పోలీసు బృందం, ఈ కేసును విచారణ చేయడం ప్రారంభిస్తారు. మాజే సౌమ్య మైన రూపం వెనుక ఒక ఏదో రహస్యం దాగి ఉన్నట్లు అనుమానిస్తారు. విచారణ సాగుతున్న కొద్దీ మాజే ఒక తన భర్తకు తెలీకుండా సాల్వా అనే మరో వ్యక్తితో సంబంధం కలిగి ఉందని తెలుస్తుంది. సాల్వా పనిచేసే చోటే మాజే కూడా పనిచేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య సంబంధం నడుస్తుంటుంది. ఆమె భర్త హత్యలో ప్రియుడు కీలక పాత్ర పోషిస్తాడు. మాజే తన భర్తను హత్య చేయడానికి సాల్వాను మానసికంగా మానిప్యులేట్ చేస్తుంది. ఆమె భర్త నుండి విడాకులు తీసుకోకుండా వితంతు పెన్షన్, ఆస్తిని పొందేందుకు ఈ హత్యను ప్లాన్ చేసిందని విచారణలో వెల్లడవుతుంది. మాజే తన ప్రేమికుడిని కూడా మోసం చేసి, హత్యకు ప్రేరేపించిన తీరు బ్లాక్ విడో స్పైడర్‌ను పోలి ఉంటుంది. ఈ హత్య ప్రియుడితో ఏకాంతంగా గడిపిన తరువాత జరుగుతుంది. అంతలా ఈమె ప్రియుడిని మానిప్యులేట్ చేస్తుంది. డిటెక్టివ్ ఈవా కేసును లోతుగా తవ్వడంతో, మాజే నిజమైన మోసపూరిత స్వభావం బయటపడుతుంది. ఆమె ఇతనితోనే కాకుండా చాలా మంది పురుషులతో సంబంధాలు నాడుపుతూ, వారి బలహీనతలను ఉపయోగించుకుటుంది. సాల్వా మొదట మాజేను రక్షించడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఆమె జైలులో ఉండగా మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిన తర్వాత, అతని మనసు మారిపోతుంది. చివరికి ఈ కేసులో మాజే కు జైలు శిక్ష పడుతుందా ? ఆమె ప్రవర్తన తెలిసి ప్రియుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? ఈమె ఉచ్చులో ఎంతమంది చిక్కుకుంటారు. అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.


Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×