PBKS VS RCB FINAL : ఐపీఎల్ సీజన్ లో ఇవాళ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్ తొలి బంతినే వైడ్ వేయడంతో బెంగళూరు జట్టుకి బ్యాటర్ కొట్టకుండానే పరుగులు లభించాయి. ఇక ఓపెనర్ ఫిల్ సాల్ట్ 9 బంతుల్లో 16 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 35 బంతుల్లో 43 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మయాంక్ అగర్వాల్ 24 పరుగులు చేశాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ 16 బంతుల్లో 26 పరుగులు చేశాడు. లివింగ్ స్టోన్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఔట్ అయ్యాడో.. అప్పుడే క్రీజులోకి వచ్చిన జితేష్ శర్మ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తానికి 20 ఓవర్లలో ఆర్సీబీ జట్టు 190/9 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ ముందు ఉన్నటువంటి లక్ష్యం 191 పరుగులు.
Also Read : WI Team In Traffic : ట్రాఫిక్ లో చిక్కుకున్న వెస్టిండీస్… ఆగిపోయిన టాస్… క్రికెట్ చరిత్రలోనే తొలిసారి
ఇక ఈ మ్యాచ్ లో జితేష్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని అంతా భావించారు. కానీ తొందరగానే వెనుదిరిగాడు. లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడునుకున్న సమయంలోనే జితేష్ శర్మ ను విజయ్ కుమార్ వైశాక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 10 బంతుల్లో 24 పరుగులు చేసి జితేష్ శర్మ వెనుదిరిగాడు. ఇక ఆ తరువాత కొద్ది సేపటికే షెఫర్డ్ LBW గా ఔట్ అయ్యాడు. దీంతో చివరి ఓవర్లో భారీ పరుగులు వస్తాయనుకుంటే.. అది జరుగలేదు. ఈ మ్యాచ్ లో మొదటి క్యాచ్ సాల్ట్ ది శ్రేయాస్ అయ్యర్ పట్టాడు.పంజాబ్ కింగ్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి బెంగళూరు బ్యాటర్లు రెచ్చిపోకుండా చివరి ఓవర్ లో మూడు రన్స్, మూడు వికెట్లు తీసుకున్నాడు అర్ష్ దీప్ సింగ్.
పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధిస్తుందని ఇప్పటికీ అభిమానులు పేర్కొనడం విశేషం. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 180 కి పైగా పరుగులు చేసిన సమయంలో చాలా సందర్భాల్లో డిఫెండింగ్ చేసుకోవడం విశేషం. ఈ మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ కి కాస్త లక్ కలిసి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. ఆర్సీబీ ఆటగాళ్లకు అంతగా కలిసి రాలేదు. ఫైనల్ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన ఆటగాళ్లు కొద్ది మంది మాత్రమే తమ ప్రతిభను చాటారు. మిగతా ఆటగాళ్లు టకటక ఔట్ కావడంతో ఆర్సీబీ ఫైనల్ లో సత్తా చూపించలేకపోయింది. కొద్ది మంది బ్యాటర్లు మాత్రం రెచ్చిపోయినప్పటికీ.. ఆర్సీబీకి గౌరవ ప్రదమైన స్కోర్ నే అందించారు. ఈ మ్యాచ్ లో మాత్రం ఆర్సీబీ జట్టు పై ఇప్పటికే ట్రోలింగ్స్ జరగడం విశేషం.