OTT Movie : భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ తో వస్తున్న సినిమాలు క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ఆడియన్స్ కూడా డిఫరెంట్ స్టోరీలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కంటెంట్ బాగుంటే ఏ భాష అయినా సరే ఓటీటీ వదలట్లేదు. ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్‌లను డిఫరెంట్ గా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు మేకర్స్. సరికొత్త కథాంశంతో ఒక బెంగాలీ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ని తెగ ఆకట్టుకుంటోంది. పెళ్లయిన రోజే భర్త వదిలేసి వెళ్లిపోతే ఆ భార్య అత్తింట్లో ఎలా గడిపిందనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఇది హార్ట్ టచింగ్ సీన్లతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘గృహప్రవేశ్’ (Grihapravesh) 2025లో వచ్చిన బెంగాలీ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా మూవీ. ఇంద్రాదీప్ దాస్‌గుప్తా దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో తిత్లి (సుభాష్రీ గంగూలీ), షావో (కౌశిక్ గంగూలీ), మేఘ్ (జీతు కమల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 జూన్ 13న థియేటర్లలో విడుదల అయింది. IMDbలో 7.1/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా హోయ్‌చోయ్‌లో అక్టోబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కలకత్తాలో తిత్లి అనే మహిళకి, షావో అనే వ్యక్తితో వివాహం జరుగుతుంది. ఇక కొత్త జీవితం కోసం తిత్లి ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. పెళ్లి తర్వాత ఆమె తన భర్త ఇంటికి వస్తుంది. కానీ వివాహం అయిన తరువాత భర్త మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అతను ఎందుకు వెళ్లాడో, ఎక్కడికి వెళ్లాడో ఎవరికీ తెలియదు. ఆ ఇంట్లో తిత్లి మాత్రం ఒంటరిగా మిగిలిపోతుంది. ఆమె షావో తల్లిదండ్రులతో ఆ ఇంట్లో ఉంటూ, వాళ్లను చూసుకుంటుంది. ఆమె రోజూ ఇంటి పనులు చేసుకుంటూ, పాత ఆచారాలను పాటిస్తుంటుంది. కానీ ఆమె మనసులో షావో గురించి బాధపడుతుంటుంది. పెళ్ళైనా ఒంటరితనంగా ఉండటంతో కాస్త దిగులు పడుతుంది.
Read Also : ఏం సినిమా గురూ… బెడ్ రూమ్‌లో అలాంటి సీన్స్… సింగిల్స్ పండగ చేసుకునే సినిమా
ఒక రోజు దుర్గా పూజ సమయంలో, ఊరంతా సందడిగా ఉంటుంది. ఈ సమయంలో మేఘ్ అనే తిత్లి పాత స్నేహితుడు ఆ ఊరికి వస్తాడు. అతను ఒక ఫొటోగ్రాఫర్. మేఘ్ రాకతో తిత్లి జీవితంలో కొత్త మలుపు తిరుగుతుంది. అతను ఆమెను బయటకు తీసుకెళ్లి, జీవితంలో కొంచెం సంతోషం తీసుకొస్తాడు. దుర్గా పూజ సమయంలో ఇల్లు, ఊరు సందడిగా ఉంటుంది. కానీ తిత్లి మనసులో షావో అదృశ్యమవడం గురించి ప్రశ్నలు మొదలవుతాయి. షావో తల్లిదండ్రులు కూడా కొడుకుని గుర్తు చేసుకుని బాధపడుతుంటారు. ఈ సమయంలో మేఘ్‌తో స్నేహం తిత్లికి కొంచెం ధైర్యం ఇస్తుంది. కానీ షావో అదృశ్యం వెనుక ఒక పెద్ద రహస్యం బయట పడుతుంది. ఈ రహస్యం ఆమె జీవితాన్నిషేక్ చేస్తుంది. ఆ రహస్యం ఏమిటి ? షావో మళ్ళీ తిరిగి వస్తాడా ? తిత్లి ఎలాంటి జీవితం గడుపుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.