Akhanda 2 OTT: నందమూరి నటసింహం బాలయ్య నటించిన తాజా చిత్రం అఖండ 2.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చాయి.. ఆ మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. ఇప్పుడు వచ్చిన నాలుగవ సినిమా యావరేజ్ టాక్ ను అందుకుంది. గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 మూవీ వచ్చింది. గ తేడాది డిసెంబర్ 12న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.. దాంతో ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కి రాబోతుందో వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…
బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నందమూరి బాలయ్య హీరోగా చేయగా సంయుక్త మీనన్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.. ప్రముఖ నటుడు ఆది పినశెట్టి విలన్ పాత్రలో నటించారు. హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూ ఈ కథాంశం ఉన్న నేపథ్యంలో జనాలకు బాగానే నచ్చింది. 500 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంటుందని నందమూరి అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ కేవలం ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిందట ఆఖండ 2. అయితే అలాంటి అఖండ 2 సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చింది.. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీ రైట్స్ ని భారీ ధరకు కొనుగోలు చేస్తుంది.. ఈనెల తొమ్మిదవ తేదీన ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించింది. ఈ మూవీని ఎప్పుడెప్పుడు ఓటీటీ లో చూద్దామని నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇక్కడ వచ్చిన మూవీ ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి..
Also Read: లైవ్ లో కన్నీళ్లు పెట్టుకున్న అమితాబ్.. అసలేం జరిగిందంటే..?
బాలయ్య సినిమాలకు ఎప్పుడు బిజినెస్ ఓ రేంజ్ లో ఉంటుందన్న విషయం తెలిసిందే. అదేవిధంగా అఖండ కి సీక్వెల్ గా వచ్చిన అఖండ 2 కు మంచి క్రేజ్ ఏర్పడింది. రూ.101 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.102 కోట్ల షేర్ ను రాబట్టాలి. 3 వారాలు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.68.35 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ పరంగా రూ.117.40 కోట్లు రాబట్టింది.. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.33.65 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. న్యూ ఇయర్ రోజు హాలిడేని ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. దాంతో కలెక్షన్లు బాగా పెరిగాయి. ఇక సినిమాను ఓటీటీ లోకి తీసుకొచ్చేందుకు డేట్ ని లాక్ చేస్తారు. ఇక్కడ యావరేజ్ టాక్ ను అందుకున్న సినిమా అక్కడ ఎలాంటి టాక్ ని అందుకుంటుందో చూడాలి..