Karimnagar Incident: Karimnagar Incident: రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో వివాహిత రమ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమ్య భర్త దుబాయ్‌లో ఉండగా.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుటుంబ కలహాలతో రమ్య ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్‌కు వెళ్లి వచ్చిన పిల్లలు.. ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వాళ్ల అమ్మ ఎంతసేపటికి డోర్ తీయలేదు. కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుంది. స్థానికులు.. ఇంటి తలుపులు బద్దలుకొట్టారు. విగతజీవిగా మారిన తల్లిని చూసి.. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వీళ్ల స్థితిని చూసి.. స్థానికులంతా కన్నీటిపర్యంతమయ్యారు.
పూర్తి వివరాల ప్రకారం..
అయితే రమ్యకు తన అత్తింటి వారితో, ముఖ్యంగా అత్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ కుటుంబ కలహాలు మనస్తాపానికి దారితీసి, ఆమె ఈ ఆలోచనకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే రమ్య భర్త హరి దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఆయన విదేశాల్లో ఉండటంతో, రమ్య ఒంటరిగా అత్తింట్లో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. ఆమెకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.. వీరు స్కూల్ వయస్సు చేరినవారు. ఈ పిల్లలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తల్లి విగతజీవిగా పడి ఉంది. పాపం ఆ చిన్నారులకు తెలియక’అమ్మా.. లే అమ్మా కళ్ళు తెరువు’ అని ఏడుస్తూ కన్నీరుమున్నీరుగా మారారు. ఈ దృశ్యం చూస్తే గుండె పగిలిపోతుంది. పాపం ఆ ముగ్గురు చిన్నారులు తల్లి మరణంతో అనాథలయ్యారు.
అత్తతో గొడవ కారణంగానే రమ్య ఉరి వేసుకుని ఆత్మహత్య..
ఈ ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది. అక్కడి స్థానికులు రమ్యను ఒక మంచి మహిళగా.. కుటుంబానికి తోడుగా ఉండేవారిగా చెబుతున్నారు. కానీ, కుటుంబంలో జరిగే చిన్న గొడవలు కూడా మానసికంగా ఒత్తిడి కలిగించి, ఇలాంటి దారుణ పరిణామాలకు దారితీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి, కుటుంబ కలహాలు కారణమా లేక వేరే కారణాలా అని విచారిస్తున్నారు. రమ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భర్త హరి దుబాయ్ నుంచి తిరిగి వచ్చి, పిల్లలను చూసుకోవాల్సి వచ్చింది.
Also Read: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది
తల్లి మృతితో అనాథలైన ముగ్గురు చిన్నారులు
ఈ మధ్య కాలంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మహిళల్లో ఆత్మహత్య రేటును పెంచుతున్నాయి. రమ్య విషయంలో, భర్త విదేశంలో ఉండటం వల్ల ఆమెపై ఒంటరి బాధ్యతలు ఎక్కువగా పడటం కూడా ఒక కారకంగా చెబుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక్కసారి వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు వారిని నచ్చిన నిర్ణయం వారు తీసుకుంటే పాపం ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ ముగ్గురు చిన్నారులు ఇకపై ఎవరి ఆశ్రయంలో ఉంటారు? అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.
'అమ్మా.. లే అమ్మా'.. కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల రోదన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో ఘటన
కుటుంబ కలహాలతో కలత చెంది ఉరి వేసుకుని ఈరవేణి రమ్య అనే వివాహిత ఆత్మహత్య
ఇంట్లో అత్తతో గొడవ కారణంగానే రమ్య ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం… pic.twitter.com/zxZkyzohiT
— BIG TV Breaking News (@bigtvtelugu) September 11, 2025