BigTV English

Unstoppable With NBK : అల్లు అర్జున్ మరోసారి… గెస్ట్ లిస్ట్ చూశారా… మైండ్ పోయేలా ఉంది సామి..

Unstoppable With NBK : అల్లు అర్జున్ మరోసారి… గెస్ట్ లిస్ట్ చూశారా… మైండ్ పోయేలా ఉంది సామి..

Unstoppable With NBK : టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ .. ఈ షో మూడు సీజన్లను పూర్తి చేసుకుంది . ఇప్పుడు నాలుగో సీజన్ జరుగుతుంది. ఈ షోకు విపరీతమైన క్రేజ్ ఏర్ప‌డిన‌ సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఆహా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకోవడంతో బాలయ్య నెక్స్ట్ సీజన్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ పెరిగింది. ఇప్పటికే మూడు సీజన్ లో రాజకీయ , సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ప్రతి ఎపిసోడ్ విపరీతమైన క్రేజ్ ను అందుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ ప్రారంభం అయ్యింది . ఈ సీజన్ గెస్టుల లిస్ట్ చుస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. . అందరు ప్రముఖులు కావడం విశేషం. ఇక ఈ షో కు అల్లు అర్జున్ వస్తున్నాడనే వార్తలు గత కొద్దీ రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రాజకీయ ప్రముఖులు కూడా సందడి చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఈ సీజన్ కు రాబోతున్న గెస్టులు ఎవరో ఒకసారి చూసేద్దాం..


గెస్టుగా అల్లు అర్జున్ ..

బాలయ్య అన్‌స్టాప‌బుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 24 నుంచి టెలికాస్ట్ చేయనున్నట్టు నిర్వాహకులు అనౌన్స్ చేశారు. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్‌గా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఆయనతో పాటు పుష్ప 2హొల్ టీం సందడి చేయనున్నారట. త్వరలోనే పుష్ప సీక్వెల్ రిలీజ్ కానున్న క్రమంలో.. పుష్ప 2 టీం అంతా వచ్చి సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలో ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరగనుందట. తాజా సమాచారం ప్రకారం ఈ ఎపిసోడ్ పూర్తి అయ్యిందని తెలుస్తుంది. అల్లు అర్జున్ ఎపిసోడ్ ను రెండు పార్ట్లు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. బాలయ్య , ఐకాన్ స్టార్ ఇంటర్వ్యూలో నంద్యాల ఎపిసోడ్‌ ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార టైం లో నంద్యాల వైసిపి అభ్యర్థి ఆయన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కీలక విషయాలను అల్లు అర్జున్ బయటపెట్టే అవకాశాలు ఉన్నాయి.. ఇక పుష్ప 2 మూవీ డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..


అన్‌స్టాప‌బుల్ సీజన్ 4 గెస్టులు ఎవరంటే ?

ఇక మొదటి మూడు సీజన్ల కంటే కూడా సీజన్ 4లో ప్రశ్నలు కాస్త ఘాటుగా ఉంటాయని ఇప్పటికే బాలయ్య చెప్పారు. అన్ లిమిటెడ్ ఎంటర్ టైన్ మెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు ఈ షో రెడీగా ఉందన్నారు. ‘అన్ స్టాపబుల్’ సీజన్ 4లో పలు స్టార్ హీరోలు సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తొలి ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప 2’ టీమ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ యాక్టర్ సన్నీ డియోల్, దర్శకుడు గోపీచంద్ మలినేలితో పాటు పలువురు సినీ సెలబ్రిటీలో ఈ టాక్ షోలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి , నాగార్జున , పవన్ కళ్యాణ్ , ఎపి ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాబోతున్నట్లు సమాచారం..

ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం .. ఫస్ట్ ఎపిసోడ్ చంద్రబాబు నాయుడు , రెండు ఎపిసోడ్ గా పవన్ కళ్యాణ్ , ఇక మూడు , నాలుగు ఎపిసోడ్ లు గా అల్లు అర్జున్ ఎపిసోడ్ లని స్ట్రీమింగ్ చేయనున్నారని టాక్ .. ఈరోజు పవన్ కళ్యాణ్ , చంద్రబాబు నాయుడు ఎపిసోడ్లను షూట్ చేయనున్నారని సమాచారం. దీనిపై ఆహా టీమ్ త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారు..

Related News

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

OTT Movie : వరుడిని కోమాలోకి పంపే పెళ్లి కూతురు కోరిక… అంతలోనే మరో పెళ్ళికి సిద్ధం… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : ఈ దెయ్యానికి అమ్మాయిలే కావాలి… ఒక్కో సీన్ కు గుండె జారిపోద్ది… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : గర్ల్స్ వాష్ రూమ్ లో సీక్రెట్ కెమెరా… విషయం తెలిసిందని అమ్మాయిపై అరాచకం… మెంటలెక్కించే ట్విస్టులు

OTT Movie : అమ్మాయిల్ని చంపి చేపలకు ఆహారంగా వేసే సైకో… గ్రిప్పింగ్ స్టోరీ, థ్రిల్లింగ్ ట్విస్టులు

OTT Movie : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్… పోలీసులకు అంతుచిక్కని వరుస మర్డర్స్ కేసు… కేక పెట్టించే మిస్టరీ థ్రిల్లర్

OTT Movie : అర్దరాత్రి కార్లో ఏకాంతంగా లవర్స్… పోలీస్ ఎంట్రీతో ఊహించని ట్విస్ట్… గుండె జారిపోయే రియల్ స్టోరీ

OTT Movie : నలుగురు అబ్బాయిలు ఒకే అమ్మాయితో… ఈ ఆడపులి రివేంజ్ కాటేరమ్మ జాతర మావా

Big Stories

×