BigTV English
Advertisement

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి టాప్ 5 మూవీస్.. డోంట్ మిస్..

OTT Movies: ఈ వారం ఓటీటీలోకి టాప్ 5  మూవీస్.. డోంట్ మిస్..

OTT Movies: ప్రతివారం థియేటర్లలో ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓటీటిలో కూడా అలాగే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్న సినిమా అయిన, యావరేజ్ టాక్ ను అందుకున్న సినిమా అయినా సరే ఓటీటీలో రిలీజ్ అయ్యి వ్యూస్ ను రాబడుతున్నాయి.. మార్చి నెల ఈ వారంతో పూర్తవుతుంది. మార్చి చివరి వారంలో బోలెడు సినిమాలు ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలలో ఐదు సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఆ ఐదు సినిమాలు ఏంటి? ఏ ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం..


మిస్టర్ హౌస్‍కీపింగ్..

తమిళ కామెడీ డ్రామా మూవీ ‘మిస్టర్ హౌస్‍కీపింగ్’ మార్చి 25న ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా తమిళ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో హరిభాస్కర్, లోహ్సిలియా మరియనేసన్ ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 24వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.. థియేటర్లలో మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..


ముఫాసా.. 

ఇదొక యానిమేషన్ మూవీ.. చిన్న పిల్లలతో పాటుగా పెద్ద పిల్లలు కూడా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేస్తారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అని అందుకున్న ఈ మూవీ ఓటిటి లోకి రాబోతుంది. ప్రముఖ ఓటిటి సంస్థ జియో హాట్ స్టార్ ఈనెల 26న ఈ సినిమాను స్ట్రీమింగ్ తీసుకురాబోతున్నారు. ముఫాసా రాజుగా ఎలా ఎదిగాడన్న అంశంతో లయన్ కింగ్ చిత్రానికి సీక్వెల్‍గా తీసుకొచ్చారు.. 2023 డిసెంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

శబ్దం.. 

టాలీవుడ్ హీరో ఆది పినశెట్టి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ శబ్దం.. మార్చి 28వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు బయటికి వచ్చాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అళివరగన్ వెంకటాచలం దర్శకత్వం వహించిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది.

మజాకా..

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం మజాకా.. ఈ వారంలోనే స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. మార్చి 28వ తేదీన జీ5 ఓటీటీలో చిత్రం ఎంట్రీ ఇస్తుందని తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏడాది ఫిబ్రవరి 26న థియేటర్లలో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఓం కాళి జై కాళి..

ఇదొక క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఓం కాళి జై కాళి’ మార్చి 28వ తేదీన జియోహాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తమిళ సిరీస్ తెలుగు, మలయాళం, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. భారీ అంచనాలతో రిలీజ్ కాబోతున్నాయి సిరీస్ ఓటిటిలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

ఇవే కాదు వీటితోపాటు మరికొన్ని సినిమాలు కూడా సడన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాయి మరి ఆ సినిమాలు ఏంటో తెలియాలంటే రెండు మూడు రోజులు వెయిట్ చేయాల్సిందే..

Tags

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×