BigTV English

David Warner: రాజేంద్రప్రసాద్ పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ సీరియస్ !

David Warner: రాజేంద్రప్రసాద్ పై  డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్  సీరియస్ !

రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ :


David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భారతీయ సినిమాలపై తనకు ఉన్న ప్రేమను ఇప్పటికే అనేక సందర్భాలలో ప్రదర్శించాడు. సినిమాలలోని సాంగ్స్, డైలాగ్స్ ని ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ అభిమానులు ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని సినిమాలలోకి రావాలని కోరారు అభిమానులు. ఈ నేపథ్యంలో అతడు తన తెలుగు సినిమా అరంగేట్రాన్ని “రాబిన్ హుడ్ ” సినిమా ద్వారా ప్రకటించినప్పుడు అభిమానులు కూడా పెద్దగా ఆశ్చర్యపోలేదు.

 


వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటించగా.. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు వార్నర్. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా డేవిడ్ వార్నర్ విచ్చేశారు.

ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు. ఈ రాబిన్ హుడ్ మూవీ సెకండ్ హాఫ్ లో వార్నర్ కీలక పాత్ర ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న నటుడు రాజేంద్రప్రసాద్.. హీరో నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ గురించి మాట్లాడారు. ఈ వేసవిలో కుటుంబ సమేతంగా చూసి ఆనందించి, అధ్యంతం నవ్వుకునేలా ఓ మంచి సినిమాను చూడబోతున్నారని అన్నారు. ఈ మధ్యకాలంలో ఇంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమా రాలేదని చెప్పుకొచ్చారు రాజేంద్రప్రసాద్. ఈ సినిమా తరువాత నితిన్ స్థాయి మారుతుందని.. ఈ మూవీలో తన పాత్రకి, వెన్నెల కిషోర్ పాత్రకి అందరూ ఎతగానో నవ్వుతూ ఎంజాయ్ చేస్తారని చెప్పుకొచ్చారు.

వార్నర్ పై రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు:

ఆయన మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ” ఈ చిత్రంలో వెంకీ, నితిన్ కలిసి క్రికెటర్ డేవిడ్ వార్నర్ ను పట్టుకొచ్చారు. వాడు క్రికెట్ ఆడమంటే పుష్పా స్టెప్పులు వేస్తున్నాడు. అరేయ్ వార్నర్.. దొంగ ముం** కొడుకు. రేయ్ వార్నర్. ఇదే వార్నింగ్.. రాబిన్హుడ్ లాంటి చిత్రాలు నువ్వు ఇంకెన్నో చేయాలని, వెంకీ లాంటి దర్శకులతో మళ్ళీ మళ్ళీ నటించాలని అనుకుంటున్నాను” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాజేంద్రప్రసాద్.

 

రాజేంద్రప్రసాద్ సరదాగానే ఈ కామెంట్స్ చేసినా.. ఇలా మాట్లాడడం ఏంటని వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్రప్రసాద్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఇదే ఈవెంట్ లో వార్నర్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీ లోకి వచ్చేందుకు మొదట కాస్త టెన్షన్ పడ్డానని తెలిపారు. మొదట తన ప్రసంగాన్ని తెలుగులో నమస్కారం అని ప్రారంభించాడు వార్నర్. రాబిన్ హుడ్ టీమ్ తనకు ఎంతో సపోర్ట్ ఇచ్చిందన్నాడు. ఈ సినిమా ఘనవిజయ నీ సాధిస్తుందని.. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.

Tags

Related News

PAK Vs BAN : పాకిస్తాన్ కి షాక్.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్

PAK Vs BAN : టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Smriti Mandana : స్మృతి మంధానకు ఘోర అవమానం… ఆ ఫోటోలు వైరల్ చేసి!

Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !

Inzamam-ul-Haq : అభిషేక్ శర్మ బ్యాట్ లో చిప్స్.. అందుకే దారుణంగా ఆడుతున్నాడు

Asia Cup 2025 : అభిషేక్ శర్మ రనౌట్… దుబాయ్ స్టేడియంలో ఏడ్చేసిన లేడీ

Team India : వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక..వైస్ కెప్టెన్ గా జ‌డేజా..షెడ్యూల్ ఇదే

Big Stories

×