BigTV English

OTT Horror Movie : ఆ శపించబడిన సొరంగాన్ని తెరిస్తే ప్రపంచ అంతం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

OTT Horror Movie : ఆ శపించబడిన సొరంగాన్ని తెరిస్తే ప్రపంచ అంతం… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని హర్రర్ మూవీ

OTT Horror Movie : హర్రర్ థ్రిల్లర్ మూవీస్ ను చూడాలంటే ఆసక్తి మాత్రమే కాదు కొంచెం ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే అందులో వచ్చే కొన్ని భయానక సన్నివేశాలు గుండె దడని పెంచుతాయి. అందుకే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఇలాంటి సినిమాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇంకా సీను సీనుకో ట్విస్ట్ తో భయపెట్టే ఇటువంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలు ఒంటరిగా చూడటం అంటే సాహసమే అని చెప్పాలి. ఇంతకుముందు థియేటర్లలోనే ఇటువంటి హారర్ సినిమాలు చూసేవారు. కానీ ఇప్పుడు ఓటిటిల పుణ్యమా అని ఓటీటీల ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్ ల రూపంలో డైరెక్ట్ గా ఇంట్లోనే చూస్తున్నారు. అయితే తాజాగా ప్రేక్షకులను దారుణంగా భయభ్రాంతులకు గురి చేసే వెబ్ సిరీస్ ఒకటి ఓటిటిలో రిలీజ్ అయింది. ఈ సిరీస్ లో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. మరి ఆ వెబ్ సిరీస్ పేరేమిటో, కథ ఏమిటో తెలుసుకుందాం పదండి.


నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
వెన్నులో వణుకు పుట్టించే ఈ సిరీస్ పేరు ‘బేతాల్’ (Betaal). ఈ సిరీస్ కు పాట్రిక్ గ్రాహం దర్శకత్వం వహించారు. నిఖిల్ మహాజన్ సహ-దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో అహానా కుమ్రా, వినీత్ కుమార్ సింగ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ అయిన ఈ రెడ్ చిల్లీస్ కు ఈ వెబ్ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘బేతాల్’ (Betaal) వెబ్ సిరీస్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ను చూసే ప్రేక్షకులు మాత్రం అందులో ఉండే హర్రర్ థ్రిల్లర్ సస్పెన్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు.

కథలోకి వెళితే…
బేతాల్‘ (Betaal) అనేది ఆధునిక కాలపు పోలీసులు, శతాబ్దాల నాటి బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ అధికారుల మధ్య జరిగిన యుద్ధం గురించిన భారతీయ కల్పిత భయానక వెబ్ సిరీస్. స్టోరీలోకి వెళ్తే.. ఒక పల్లెటూరిలో కొంతమంది అమ్మాయిలకు దయ్యాలు కనపడుతూ ఉంటాయి. ఆ ఊర్లో ఉన్న శపించబడిన పర్వతం గుండా సొరంగంను తిరిగి తెరవడానికి గ్రామస్తులను హెల్ప్ అడుగుతారు అధికారులు. కానీ దానికి ఎవ్వరూ ఒప్పుకోరు. దీంతో ఆ ఊర్లోని ప్రజలను అక్కడి నుంచి వేరే చోటికి తరలించి, పని కానిద్దాం అనుకుంటారు. దీంతో గవర్నమెంట్ అధికారులు గిరిజనుల ప్రతిఘటనతో పాటు ఆ సొరంగాన్ని ఓపెన్ చేసి మరోప్రపంచపు దాడిని ఎదుర్కొంటారు. హఠాత్తుగా ఆ సొరంగ మార్గం ద్వారా అత్యంత భయంకరమైన దయ్యాలు బయటికి వచ్చి వారిపై దాడి చేస్తాయి. ఈ దాడి చేసే సన్నివేశాలను చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే. ఈ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ (Betaal)ను మీరు కూడా చూడాలనుకుంటే ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో చూసేయండి.


Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×