BigTV English

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పక్కింటి అక్కను చూపించమన్న అమర్‌ – ఆరును మిస్సమ్మ ఒక్కతే విడిపించగలదన్న యముడు  

Nindu Noorella Saavasam Serial Today October 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  పక్కింటి అక్కను చూపించమన్న అమర్‌ – ఆరును మిస్సమ్మ ఒక్కతే విడిపించగలదన్న యముడు  

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజు నీకోక సర్‌ప్రైజ్‌ అంటూ ఆరు ఇచ్చిన గిప్ట్‌ ను చూపిస్తుంది మిస్సమ్మ. గిప్ట్‌ ను చూసిన అమర్‌ ఉద్వేగానికి లోనవుతాడు. అంజు ఏడుస్తుంది ఏమైందని మిస్సమ్మ అడుగుతుంది. మనోహరి మాత్రం టెన్షన్‌గా ఆరును ఘోర బంధించాడా లేదా? అని ఆలోచిస్తుంది. అమ్ము, అనంద్‌, ఆకాష్‌ ముగ్గురూ ఎమోషనల్‌ గా చూస్తూ డాడ్‌ ఇది అచ్చం అమ్మ చేసిన హ్యాపీ ప్యారెట్‌ లాగే ఉందని చెప్తారు. అమర్‌ కూడా హ్యాపీ ప్యారెట్‌ అంటాడు.


మనోహరి రూంలోంచి బయటకు వచ్చి ఘోర మనోహరికి సీసాలో బంధించిన ఆరు ఆత్మను చూపించి వెళ్లిపోతాడు. మనోహరి సంతోషంగా చూస్తుంది. ఇక అంజు ఏడుస్తూ.. డాడ్‌ ఇది అచ్చం అమ్మ చేసినట్టే ఉంది అంటుంది. అవును ప్రతి బర్తుడేకు అమ్మ.. అంజుకు గిప్ట్‌ ఇచ్చేది అంటాడు. ఆనంద్‌ కూడా లాస్ట్‌ ఇయర్‌ అంజుకు హ్యాపీ ప్యారెట్‌  నచ్చిందని నెక్స్ట్‌ ఇయర్‌ ఇస్తా అంది అంటాడు. దీంతో అమర్‌.. మీ అమ్మ లేకపోయినా మాట నిలబెట్టుకుంది అంటాడు.

అంజు మాత్రం ఏడుస్తూనే.. నాకు తెలుసు మా అమ్మే నాకోసం ఈ గిఫ్ట్‌ పంపించినట్టు ఉంది. డాడ్‌ నిజం చెప్పండి డాడ్‌ మమ్మీ కదా వచ్చింది. నిజం చెప్పండి డాడ్‌ మమ్మే కదా ఈ బొమ్మ నాకు పంపించింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో కరుణ బర్తుడే పూట ఎవరైనా ఏడుస్తారా? చెప్పు.. చూడు నీకు ఎన్ని గిఫ్టులు వచ్చాయే చూడు. అంటూ అంజును ఓదారుస్తూ లోపలికి తీసుకెళ్తుంది. ఇక అమర్‌ వచ్చిన వాళ్లకు భోజనాలు రెడీ చేయమని రాథోడ్ కు చెప్తాడు. అలాగే మిస్సమ్మను పక్కింటి అక్క వస్తే నాకు పరిచయం చేయ్‌ అని చెప్తాడు.


తను ఇక రాదేమో అంటుంది మనోహరి. అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు మనోహరి గారు. ఆవిడ మీకు కూడ తెలుసా..? అని మిస్సమ్మ అడుగుతంది. అంటే గిప్ట్‌ ఇచ్చి వెళ్లారు కదా.. మళ్లీ రారని అనుకున్నాను అని మనోహరి చెప్పగానే..  ఏదో పని ఉందని వెళ్లారు. మళ్లీ వస్తారు.  ఎలాంటి పరిస్థుల్లో ఉన్నా అక్క తిరిగి వస్తారు. వస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్తుంది మిస్సమ్మ. దీంతో చిన్నగా నవ్వుకుంటూ పిచ్చిదానా అరుందతిని పర్మినెంట్‌ గా పంపిచేశాను. అని మనసులో అనుకుంటుంది మనోహరి. ఇంతోల మిస్సమ్మ సరేలేండి అక్కను కలిసిన వెంటనే తప్పకుండా పరిచయం చేస్తాను అని అమర్‌కు చెప్తుంది. అమర్‌ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మిస్సమ్మ.. గిఫ్ట్‌ ఇచ్చిన తర్వాత ఆరు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. ఎందుకు అలా చెప్పింది అని ఆలోచిస్తుంది.

ఆరు కనిపంచకపోయే సరికి గుప్త కంగారుగా బాలిక ఎక్కడు ఉన్నావు అంటూ పిలుస్తాడు. ఇల్లంతా వెతుకుతాడు. ఎక్కడా ఆరు కనిపించకపోయే సరికి గార్డెన్‌ లోకి వెళ్తాడు. మరోవైపు ఆరును బంధించి తీసుకెళ్లిన ఘోర ప్రత్యేక పూజ చేస్తుంటాడు. ఇంతలో అక్కడికి మనోహరి వస్తుంది. మనోహరిని చూసిన ఘోర సంతోషంగా సాధించాము మనోహరి ఇప్పుడు చెప్పు నీకేం కావాలో చేస్తాను అంటాడు. దీంతో మనోహరి కోపంగా ముందు ఆ రణవీర్‌ ను చంపేయ్‌ ఘోర.. వాడి వల్ల నాకు మనఃశాంతి లేకుండా పోయింది అంటుంది.

బాగా ఆలోచించుకుని చెప్పు మనోహరి ఎంతైనా నీకు తాళి కట్టిన భర్త  అతను అంటాడు ఘోర .  ఆ భర్త, ఆ బతుకు వదిలేసుకుని వచ్చిన దాన్ని నేను ఆ రణవీర్‌ ప్రాణాలతో ఉన్నన్ని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను ఘోర అంటుంది. దీంతో సరే మనోహరి నీకు మాట ఇస్తున్నాను రేపు ఉదయం నీ కోరికలు నెరవేరుస్తాను అంటాడు. ఇక సంతోషంగా మనోహరి ఆరును తిడుతుంది. అదెంత దాని బతుకెంత ఇన్నాళ్లు ఏన్నో దేవుళ్లకు పూజలు చేసింది ఇప్పుడు ఏ దేవడు వచ్చి కాపాడతాడో చూస్తాను అంటుంది.

ఆరును వెతుక్కుంటూ గార్డెన్‌ లోకి వెళ్లిన గుప్తుకు ఆరు కనిపించదు. తన ఉంగరం తీసుకుని మత్రించి చూడగానే ఘోర కూడా అక్కడ ఉన్నట్లు కనిపించదు. గుప్తకు అనుమానం వస్తుంది. ఘోర, ఆరును బందించాడేమో అనుకుంటాడు. ఇంతలో యముడు వచ్చి ఆ ఘోర బాలికను బంధించాడని చెప్తాడు. వాడి దగ్గర ఆ బాలిక ఆత్మ ఎక్కువ రోజులు ఉంటే మానవాళికి నష్టం జరగుతుందని ఆ బాలిక రక్తసంబందమైన సోదరి పూజలు చేస్తే ఆ బాలికకు ఘోర నుంచి ఆ దేవి విముక్తి కల్పింస్తుందని చెప్తాడు. దీంతో మిస్సమ్మతో ఎలాగైనా పూజలు చేయించాలనుకుంటాడు గుప్త.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big tv Kissik Talks: గోకులంలో సీత 2 మనసులో మాట బయటపెట్టిన రాశి… పవన్ ఛాన్స్ ఇస్తారా?

Big tv Kissik Talks:  కూతురి కోసం శ్రీకాంత్ కొడుకును లైన్ లో పెట్టిన రాశి..పెద్ద ప్లానింగే!

Big Stories

×