Bhairavam OTT : దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మంచు మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాలో మనోజ్ తో పాటుగా నారా రోహిత్, అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించారు. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో తెరకెక్కిన ఏ మూవీ ఇవాళ థియేటర్లలోకి వచ్చేసింది.. ముగ్గురు హీరోలు ఈ సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ప్రచార కార్యక్రమాలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. మే 30వ తేదీన భైరవం ప్రేక్షకుల ముందుకొచ్చింది.. సినిమా రిలీజ్ కి ముందే మంచి బిజినెస్ ని అందుకున్న ఈ మూవీ.. ఓటిటి హక్కుల విషయంలో కూడా భారీగానే వసూలు చేసిందని తెలుస్తుంది.. మరి ఈ మూవీ ఓటీటీ హక్కుల గురించి ఒకసారి తెలుసుకుందాం..
భైరవం ప్రీ రిలీజ్ బిజినెస్..?
ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో నటించడంతో ఈ సినిమాపై భారీ హైఫ్ క్రియేట్ అయింది.. దాంతోపాటుగా సినిమా స్టోరీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపించింది. సినిమా విడుదలకు ముందు రిలీజ్ అయిన టీజర్లు, ట్రైలర్లకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచు మనోజ్ అంతా తానై ప్రమోషనల్ కార్యక్రమాలను నడిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు థియేట్రికల్ నబిజినెస్ కూడా బాగానే జరిగినట్లు ఫిలింనగర్ టాక్.. ఆంధ్రలో రూ.7.50 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో రూ.2.2 కోట్లు చొప్పున భైరవం చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.18.20 కోట్ల, నైజాంలో రూ.6 కోట్లు, సీడెడ్‌లో రూ.2.5 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం.. మొత్తానికి ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే రూ.19 కోట్ల షేర్, రూ.38 కోట్ల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి.
ఓటీటీ డీటెయిల్స్..
ఈమధ్య ఆ థియేటర్లలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా ముందుగా ఓటీటీలో డీల్ ను ఫిక్స్ చేసుకుంటున్నాయి. అలాగే ఈ మూవీ కూడా భారీ ధరకు ఓటీటీ హక్కుల ను కొనుగోలు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంస్థ రూ.32 కోట్లు వెచ్చించి దక్కించుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేటర్‌లో రిలీజైన నాలుగు నుంచి 5 వారాల తర్వాత ఓటీటీలో రావాలనే నిబంధన మేరకు జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో భైరవం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతం అయితే మిక్స్డ్ టాక్ ని అందుకున్న ఈ మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఈ వీకెండ్ కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని సమాచారం. థియేటర్లలో సినిమా సక్సెస్ఫుల్గా రన్ అయితే ఓటిటిలోకి రావడానికి ఆలస్యం అవుతుంది.
ఈ మూవీ తమిళంలో వచ్చిన గరుడన్ మూవీ కి రీమేక్ గా వచ్చింది. తమిళ వెర్షన్‌లో సూరీ హీరోగా నటించగా.. అతని స్నేహితులుగా శశికుమార్, ఉన్నిముకుందన్ కీలకపాత్రలు పోషించారు. 20 కోట్లతో వచ్చిన ఈ మూవీ దాదాపు 50 కోట్ల కలెక్షన్స్ ను అందుకుంది. గరుడన్ కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి భైరవంను తెరకెక్కించారు దర్శకుడు విజయ్ కనకమేడల.. పెన్ స్టూడియెస్ డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ ఈ భైరవం చిత్రాన్ని నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు..