OTT Movie : దెయ్యాల సినిమాలు ఆడియన్స్ ని ఎలా భయపెడతాయో, కొన్ని రివేంజ్ థ్రిల్లర్ సినిమాలు కూడా అంతకన్నా ఎక్కువగానే భయపెడతాయి. ఇలాంటి సినిమాలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇప్పుడు మనంచెప్పుకోబోయే సినిమా, కూతుర్ని పాడు చేసిన ఒక సైకో గ్యాంగ్ పై రివేంజ్ తీర్చుకునే తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంది. థ్రిల్లర్ సినిమా అభిమానులకు, ఈ స్టోరీ కరెక్ట్ గా సూటబుల్ అవుతుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’ (The last house on the left) 2009లో వచ్చిన అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమా. డెన్నిస్ ఇలియాడిస్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సారా పాక్స్టన్, మార్థా మాక్‌ఐసాక్, గారెట్ డిలహంట్, రికీ లింధోమ్, ఆరాన్ పాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2009 మార్చి 13న విడుదల అయింది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలో, తెలుగు సబ్‌టైటిల్స్ తో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి IMDbలో 6.5/10 రేటింగ్ కూడా ఉంది.
మేరీ అనే 17 ఏళ్ల అమ్మాయి తన తల్లిదండ్రులు ఎమ్మా, జాన్ తో కలిసి వెకేషన్ కోసం ఒక లేక్ హౌస్‌కు వస్తుంది. అక్కడ మేరీ తన స్నేహితురాలు పేజ్ ను కలవడానికి వెళ్తుంది. వాళ్లు ఫన్ కోసం జస్టిన్ అనే అబ్బాయిని కలుస్తారు. జస్టిన్ ఫ్యామిలీ ఒక ఒక డేంజరస్ గ్యాంగ్. ఈ గ్యాంగ్ మేరీ, పేజ్‌ను కిడ్నాప్ చేస్తుంది. వాళ్లు మారి, పేజ్‌ను దారుణంగా బాధపెడతారు. ఒక్కొక్కరూ క్రూరంగా అనుభవిస్తారు. దీంతో ఈ బాధలను తట్టుకోలేక పేజ్ చనిపోతుంది. మేరీ గాయపడి ఎలాగో తప్పించుకుని తన తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంటుంది.
Read Also : పాడుబడ్డ బంగ్లాలో తెగిపడే తలలు… పిల్ల కోసం తల్లి దెయ్యం రచ్చ… బుర్రపాడు చేసే బెంగాలీ హర్రర్ మూవీ
మేరీ తన తల్లిదండ్రుల దగ్గరికి తీవ్ర గాయాలతో వస్తుంది. ఎమ్మా, జాన్ ఆమె పరిస్థితిని చూసి షాక్ అవుతారు. ఎమ్మా, జాన్ ఆ గ్యాంగ్ చేసిన దారుణాలు తెలుసుకుని కోపంతో రగిలిపోతారు. వాళ్ళపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు కథ భయంకరమైన రివేంజ్ తో సాగుతుంది. క్లైమాక్స్ భయంకరమైన సన్నివేశాలతో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. చివరికి ఎమ్మా, జాన్ కలిసి ఆ గ్యాంగ్ పై రివేంజ్ తీర్చుకుంటారా ? ఈ సినిమా క్లైమాక్స్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ అమెరికన్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.