OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలను, చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంటుంది. ఇలాంటి సినిమాలు ఇప్పుడు ట్రెండింగ్ లో కూడా ఉంటున్నాయి. ఈ కథలు నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. ఒక్క సారి చూడటం స్టార్ట్ చేస్తే ఆపడం కష్టమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక మర్డర్ చుట్టూ తిరుగుతుంది. అయితే దీంతో పాటు ఒక లవ్ ట్రాక్ కూడా నడుస్తుంటుంది. వీటితో పాటు వేడి పుట్టించే రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘మాంహటన్ నైట్’ (Manhattan Night) 2016లో వచ్చిన అమెరికన్ క్రైమ్ మిస్టరీ సినిమా. దీనికి బ్రయాన్ డెకుబెల్లిస్ దర్శకత్వం వహించారు. ఇందులో అడ్రియన్ యవోన్, జెన్నిఫర్, సైమన్ క్రాలీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2016 మే 20న థియేటర్లలో విడుదల అయింది.
IMDbలో 6.2/10 రేటింగ్ తో, అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
పోర్టర్ అనే జర్నలిస్ట్ మాంహటన్‌లో ఒక ట్యాబ్లాయిడ్ పేపర్‌లో పని చేస్తుంటాడు. అతను తన భార్య జెన్నిఫర్, ఇద్దరు పిల్లలతో సంతోషంగా జీవిస్తుంటాడు. పోర్టర్ స్కాండల్స్, మర్డర్ కథలు ఎక్కువగా రాస్తుంటాడు. ఇది ఇలా ఉంటే. ఒక పార్టీలో పోర్టర్ క్యారోలిన్ అనే అందమైన మహిళను కలుస్తాడు. క్యారోలిన్ భర్త సైమన్ ఒక ప్రముఖ మూవీ ప్రొడ్యూసర్. అతను ఇటీవల అనుమనస్పదంగా చనిపోయాడు. క్యారోలిన్ సైమన్ మరణం వెనుక నిజం తెలుసుకోమని పోర్టర్‌ను అడుగుతుంది. పోర్టర్ ఆమెతో అందానికి మైమరిచి, ఈ కేసును విచారించడం మొదలెడతాడు. పోర్టర్ క్యారోలిన్‌తో ఎక్కువ సమయం గడుపుతూ, సైమన్ మరణం గురించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు.
Read Also : జంప్ అవ్వడానికి ట్రై చేసి అడ్డంగా బుక్… ఇష్టం లేకుండానే ఆ పని… తెలుగు మూవీనే మావా
సైమన్ ఒక రియలిస్టిక్ మూవీ మేకర్. అతని మరణం ఒక బిల్డింగ్ డెమాలిషన్ సమయంలో జరిగిందని తెలుస్తుంది. కానీ పోర్టర్‌కు అది సందేహంగా కనిపిస్తుంది. విచారణలో సైమన్ మరణంలో కొన్ని సీక్రెట్స్ బయటపడతాయి. ఇది నడుస్తుండగానే పోర్టర్ క్యారోలిన్‌తో రొమాంటిక్ గా గడుపుతాడు. దీనివల్ల అతని భార్య జెన్నిఫర్‌తో గొడవలు మొదలవుతాయి. ఇక ఈ కథ సస్పెన్స్, రొమాన్స్, ఫ్యామిలీ టెన్షన్‌తో సాగుతుంది. చివరికి పోర్టర్ సైమన్ మరణం వెనుక నిజాన్ని బయట పెడతాడా ? క్యారోలిన్‌తో పోర్టర్ లవ్ ట్రాక్ ఎంత వరకు వెళ్తుంది ? పోర్టర్ ఫ్యామిలీ గొడవలు సర్దుకుంటాయా ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.