OTT Movie : నిజజీవితంలో జరిగే సంఘటనలతో సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ 2023లో జరిగిన ర్యాగింగ్ ఘటన నుండి తీసుకున్నారు. జాదవపూర్ యూనివర్సిటీ లో జరిగిన ఈ ఘటనలో, ఒక విద్యార్థి కూడా మరణించాడు. అతని తల్లి చేసిన న్యాయపోరాటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలాంటివి ఇప్పటివరకు ఎన్నో సంఘటనలు జరిగాయి. అయినా ఇప్పటికీ ఈ ర్యాగింగ్ భూతం నియంత్రణలోకి తీసుకురావడంలో ప్రభుత్వాలు సక్సెస్ అవ్వలేదు. సినిమాలు చూసి మారడం అటుంచి, ఇంకా సైకోలుగా మారుతున్నారు. దీనిపై తీసిన ఈ వెబ్ సీరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
Hoichoi లో స్ట్రీమింగ్
2024 లో వచ్చిన ఈ బెంగాలీ వెబ్ సీరీస్ పేరు ‘బిజోయ’ (Bijoya). ఈ వెబ్ సీరీస్ లో ర్యాగింగ్ వల్ల కోమా లోకి వెళ్లిన కొడుకు కోసం, తల్లి న్యాయపోరాటం చేస్తుంది. ఈ కథలో స్వస్తికా ముఖర్జీ బిజోయా పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ బెంగాలీ వెబ్ సీరీస్ కు సయంతన్ ఘోషాల్ దర్శకత్వం వహించారు. ఇందులో ర్యాగింగ్ శృతి మించడం వల్ల జరిగే సన్నివేశాలతో స్టోరీ నడుస్తుంది. ఈ వెబ్ సీరీస్ ఓటిటి ప్లాట్ ఫామ్ Hoichoi లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
బిజోయ అనే మహిళ తన భర్త మరణం తర్వాత కొడుకు నీల్ ని ఒంటరిగా పెంచుతుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి అతన్ని చదివిస్తుంది. నీల్ కాలేజీలో చేరినప్పుడు బిజోయ చాలా సంతోషంతో ఉంటుంది. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు ఉండదు. అతనికి కాలేజీలో ర్యాగింగ్ భూతం ఎదురవుతుంది. సీనియర్స్ బట్టలు విప్పించి దారుణంగా ర్యాగింగ్ చేసేవాళ్ళు. దీనిపై నీల్ వాళ్ళపై తిరగబడేవాడు. ఒకరోజు నీల్ కోమాలోకి వెళ్లిపోయాడని తల్లికి సమాచారం వస్తుంది. ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలచి వేస్తుంది. తన కొడుకు ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, దాని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని కనుక్కోవాలని నిర్ణయించుకుంటుంది బిజోయ. కాలేజీలో జరిగే ర్యాగింగ్ సంస్కృతిని బయటపెడుతుంది బిజోయ. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయడానికి కూడా వెనకాడతారు.
కొంతమంది వ్యక్తులు ఆమెను అంతమొందించడానికి ప్రయత్నిస్తారు. వీటిని ఆమె ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తుంది. కొడుకు కోసం ఆమె చేసే పోరాటం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడి అండతో దీనిని సైలెంట్ చెయ్యాలని చూస్తారు కాలేజ్ యాజమాన్యం. కాని ఆమె తల్లి దీనికి అడ్డు పడుతూ ఉంటుంది. ర్యాగింగ్ చేసిన వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు కావడంతో ఆమె చాలా కష్టపడుతుంది. చివరికి ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడతాడా? బిజోయ అంతం చేయాలని చూస్తుంది ఎవరు? ర్యాగింగ్ సంస్కృతికి స్వస్తి పలుకుతారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఓటిటి ప్లాట్ ఫామ్ Hoichoi లో స్ట్రీమింగ్ అవుతున్న ‘బిజోయ’ (Bijoya) అనే ఈ బెంగాలీ వెబ్ సిరీస్ ని మిస్ కాకుండా చూడండి.