BigTV English

Samantha: సమంతకు ఫామ్ హౌస్… నిజమేనని ఒప్పుకున్న నిర్మాత

Samantha: సమంతకు ఫామ్ హౌస్… నిజమేనని ఒప్పుకున్న నిర్మాత

Samantha : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకుంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఒకానొక సందర్భంలో హీరోయిన్ సమంత (Samantha)కు ఒక బడా నిర్మాత ఫామ్ హౌస్ ఇచ్చాడనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా స్వయంగా ఆ నిర్మాత మాట్లాడుతూ ఫామ్ హౌస్ ఇచ్చిన మాట నిజమేనని ఒప్పుకున్నారు. మరి ఆ నిర్మాత ఈ ఫామ్ హౌజ్ వ్యవహారం గురించి ఏమన్నారంటే?


సమంతకు పారితోషికంగా ఫామ్ హౌస్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత బెల్లంకొండ సురేష్ (Bellamkonda Suresh) కు “ఆ రోజుల్లో సమంతకు ఓ సినిమాలో యాక్ట్ చేయడానికి రెమ్యూనరేషన్ బదులు మీరు ఒక ఫామ్ హౌస్ ఇచ్చారని రూమర్స్ ఉన్నాయి. అది ఎంతవరకు నిజం?” అని ప్రశ్నించగా… బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ “నేనే అమ్మాను. అప్పట్లో దాన్ని 1.5 కోట్లకు అమ్మాను. ఇప్పుడు దాని విలువ డెబ్బై నుంచి 80 కోట్లు ఉంటుంది. నాకు ఆల్రెడీ అప్పటికే రెండు ఫామ్ హౌస్ లో ఉండడంతో ఈ ఎక్స్ట్రా ఫామ్ హౌస్ ని ఎవరికైనా అమ్మాలి అనే ఆలోచనతోనే ఉన్నాను. ఆ టైంలోనే వేరే వాళ్ళకి ఆమె బదులు సమంతకి అమ్మాను. ఆమెకు చూపించాను. నచ్చిందని కొనుక్కుంది” అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే “రెమ్యూనరేషన్ బదులు హౌస్ ఇచ్చారా?” అని అడగ్గా… “అవును రెమ్యూనరేషన్ బదులు ఫామ్ హౌస్ ఇచ్చాను” అని కన్ఫామ్ చేశారు.


దీంతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్లు ఇదేవిధంగా వర్క్ అవుతాయని కామెంట్ చేయడం మొదలు పెట్టారు నెటిజన్లు. అంతేకాకుండా వీళ్ళు ట్యాక్స్ ఎగొట్టడానికి నిర్మాతల నుంచి కార్లు, విల్లాలు ఈ విధంగా తీసుకుంటారని అంటున్నారు. మరి కొంతమంది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ను ‘నీ తండ్రి నీకోసం ఆస్తులు అమ్ముకున్నాడు, నువ్వేం తిరిగి ఇచ్చావ్’ అని ప్రశ్నిస్తున్నారు.

సన్ నెక్స్ట్ లో సామ్, బెల్లంకొండ మూవీ 

ఇదిలా ఉండగా బెల్లంకొండ సురేష్ సమంతకు ఈ ఫామ్ హౌస్ ను ‘అల్లుడు శీను’ (Alludu Seenu) సినిమాలో హీరోయిన్ గా చేసినందుకుగాను రెమ్యూనరేషన్ గా ఇచ్చారు. వివి వినాయక్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, బెల్లంకొండ సురేష్ స్వయంగా తన కొడుకు ఫస్ట్ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, సమంత హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, ప్రదీప్ రావత్ కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 2014 జూలై 25న రిలీజ్ అయిన ఈ మూవీతో బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అప్పట్లో ఒక డెబ్యూ హీరోతో సమంత హీరోయిన్ గా నటించడం అన్నది హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఆమె ఈ సినిమా కోసం భారీ పారితోషికం తీసుకుందని, నిర్మాత ఒక ఫామ్ హౌజ్ ను ఇచ్చాడని టాక్ నడిచింది. అయితేనేం బెల్లంకొండ సురేష్ తన కొడుకు కోసం పడిన కష్టం వృథా కాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కానీ ఆ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×