ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ కోసం ఫండ్స్ రిలీజ్ చేసినట్లు వెల్లడించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు 5 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ కోరింది. కేంద్రం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా సెలెక్ట్ చేసింది. కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థను ఎంపిక చేసింది. విశాఖలో రూ.84.47 లక్షలతో, విజయవాడలో రూ.86.68 లక్షలతో ఈ సంస్థ ప్లాన్ రూపొందించనుంది. ఈ పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసింది.
విజయవాడలో 3 కారిడార్లు, విశాఖలో 4 కారిడార్లు
ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం విజయవాడ, విశాఖ మెట్రోకు సుమారు రూ. 42, 000 కోట్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. విజయవాడ మెట్రోను రెండు దశల్లో మూడు కారిడార్లు పనులు చేయనుంది. మొదటి దశలో కారిడార్-1 పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి గన్నవరం వరకు నిర్మాణం కొనసాగనుంది. కారిడార్- 2 కింద నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు నిర్మించాలని ఆలోచన చేస్తోంది. సెకండ్ ఫేజ్ లో పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించేలా ప్రణాళికులు సిద్ధం చేశారు.
అటు విశాఖపట్నం మెట్రోను రెండు దశల్లో నాలుగు కారిడార్లు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. మొదటి దశలో కారిడార్-1 కింద స్టీల్ ప్లాంట్ గేటు నుంచి కొమ్మాది కూడలి వరకు నిర్మించనున్నారు. కారిడార్- 2 కింద గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీసు ప్రతిపాదించారు. కారిడార్- 3 తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు తొలి దశలో నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెకండ్ ఫేజ్ లో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది.
Read Also: జమ్మూ నుంచి శ్రీనగర్ కు రైల్వే సర్వీస్, ఓపెనింగ్ ఎప్పుడో చెప్పేసిన కేంద్రం!
రెండు మెట్రోలకు కేంద్రం నుంచే నిధులు
పునర్విభజన ప్రకారం విశాఖ, విజయవాడ మెట్రోల నిర్మాణానికి కేంద్రమే నిధులు ఇవ్వాల్సివుంది. ఏపీకి ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు నిధులు కేంద్రమే భరించాల్సి ఉంటుంది. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, ఆర్థిక వృద్దిని పెంపొందించడానికి ఈ ప్రాజెక్టులు కీలకమైనవని సీఎం చంద్రబాబు గతంలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను వెంటనే ఆమోదించి, ఆర్థిక సాయం అందించాలని రీసెంట్ గా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు కేంద్రమంత్రి ఖట్టర్ ను కోరారు.
Read Also: వందే భారత్ టికెట్ ధరలు తగ్గింపు? ఇక వారికీ లగ్జరీ రైలు సదుపాయం!
Read Also: ఇండియాలో రైల్వే ఛార్జీలు ఇంత తక్కువా? పాకిస్థాన్‌లో ఎంతో తెలుసా?