 
					OTT Movie : భార్యా భర్తల సంబంధం మంచిగా ఉంటే, ఆ కుటుంబం కూడా సమాజంలో గౌరవం పొందుతుంది. పిల్లలు కూడా మెంటలీ స్ట్రాంగ్ గా ఉంటారు. అయితే భార్యా భర్తల సంబంధం విచ్చిన్నం అవ్వడానికి మొదటి కారణం అక్రమ సంబంధం. ఏ ఒక్కరు తప్పు చేసినా, అది ఇరు కుటుంబాలతో సహా, పిల్లల మీద కూడా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఒక వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఊహించని ట్విస్ట్ల తో ఈ సిరీస్ ఆసక్తికరంగా నడుస్తుంది. ఈ సిరీస్ వివాహ సమస్యలు, విమెన్ ఎంపవర్‌మెంట్ ఇష్టపడే వాళ్లకు బాగా నచ్చుతుంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘అవుట్ ఆఫ్ లవ్’ (Out of Love) అనేది 2019లో విడుదలైన భారతీయ హిందీ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇది బ్రిటిష్ సిరీస్ డాక్టర్ ఫాస్టర్కు కి ఇండియన్ రీమేక్. దీనికి టిగ్మాన్షు ధులియా, అఇజాజ్ ఖాన్ అనే ఇద్దరు దర్శకులు పని చేశారు. మొదటి సీజన్ 2019 నవంబర్ 22, రెండో సీజన్ 2021 ఏప్రిల్ 30న జియో హాట్‌స్టార్ లో రిలీజ్ అయ్యాయి. మొదటి సీజన్‌లో 5 ఎపిసోడ్‌లు, రెండో సీజన్‌లో 5 ఎపిసోడ్‌లతో ఈ సిరీస్ ఐయండిబిలో 6.9/10 రేటింగ్ పొందింది.
మీరా ఒక మంచి పేరున్న డాక్టర్. ఆమె తన భర్త అకర్ష్, కొడుకు రాహుల్‌తో కూచ్‌లో సంతోషంగా ఉంటుంది. ఒక రోజు అకర్ష్ బట్టల్లో ఒక యువతి జుట్టు దొరుకుతుంది. మీరా ఒక్క సారిగా షాక్ అవుతుంది. భర్తని మీరా అనుమానిస్తుంది. అకర్ష్ కూడా ఇంటికి ఆలస్యంగా వస్తుంటాడు. తన ఫోన్ ని కూడా ఎవరి కంటా పడకుండా దాచిపెడుతుంటాడు. అతని మొహానికి లిప్‌స్టిక్ మార్క్ కూడా ఉంటుంది. మీరా ఇక భరించలేక ప్రైవేట్ డిటెక్టివ్ సాయం తీసుకుంటుంది. అకర్ష్ అలియా అనే యువతితో అఫైర్ లో ఉన్నాడని తెలుస్తుంది. మీరా షాకవుతుంది, కానీ మౌనంగా ఉంటుంది.
Read Also : ముక్కలైన శవాలను పేర్చి దిక్కుమాలిన ప్రయోగం… థియేటర్లలో రిలీజైన నెలలోపే ఓటీటీలోకి హాలీవుడ్ హర్రర్ మూవీ
మీరా అకర్ష్‌ను టెస్ట్ చేస్తుంది. పార్టీలు పెట్టి, అలియాను ఇంటికి పిలుస్తుంది. దీంతో అకర్ష్ భయపడుతాడు, అబద్ధాలు చెబుతాడు. మీరాకి ఏవో సాకులు చెప్పి తప్పించుకోవడానికి చూస్తాడు. అయితే మీరా రాహుల్ కి విడాకులు ఇవ్వదు, కానీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. ఈ సమయంలో అలియా గర్భవతి కూడా అవుతుంది. ఈ విషయం తెలిసి మీరాలో మరింత కోపం పెరుగుతుంది. ఒంటరిగా కుమిలిపోతుంది. ఇక ఈ కథ ఊహించని ట్విస్టులతో ముందుకు వెళ్తుంది. చివరికి మీరా భర్తపై ప్రతీకారం తీర్చుకుంటుందా ? అతనికి ఎలాంటి శిక్ష వేస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.