Biographical Crime Drama OTT : టెర్రరిజం, జిహాద్ మైండ్‌సెట్ చుట్టూ తిరిగే రియల్ స్టోరీలు చాలా ఇంటెన్స్ గా ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాది అహ్మద్ ఒమర్ సయీద్ షేక్ జీవితం ఆధారంగా ఓ బయోపిక్ తెరకెక్కింది. హన్సల్ మెహతా దర్శకత్వంలో రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జిహాద్ కి అమాయకులు కూడా ఎలా బానిసలవుతారో చూపిస్తుంది. ఈ సినిమా పేరు, స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
201లో వచ్చిన ఈ హిందీ బయోపిక్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఓమెర్టా’. హాన్సల్ మెహతా దర్శకత్వంలో ఇది రూపొందింది. రాజ్‌కుమార్ రావు మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రం, పాకిస్తానీ టెర్రరిస్ట్ అహ్మద్ ఉమర్ షేక్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కింది. రాజ్‌కుమార్ రావు ఓమర్ షేక్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఇది అతని కెరీర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్‌లో ఒకటిగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : అడవిలో తెగిపడే తలలు… నరాలు తెగే ఉత్కంఠ… మెంటల్ మాస మర్డర్ మిస్టరీ మావా
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుతున్న విద్యావంతుడైన ఒమర్ షేక్, బోస్నియాలో ముస్లింలపై జరుగుతున్న అరాచకాలను చూసి చలించిపోతాడు. అన్యాయానికి గురవుతున్న తన సామాజిక వర్గానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అతను ఉగ్రవాదం వైపు ఆకర్షితుడవుతాడు. అతను పాకిస్తాన్‌కు వెళ్లి అక్కడ అల్-ఖైదా, ISI వంటి సంస్థల ద్వారా ఆయుధాల వాడకం, బాంబుల తయారీలో కఠినమైన శిక్షణ పొందుతాడు. ఆ తరువాత1994లో విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేసే లక్ష్యంతో ఒమర్ భారత్‌కు వస్తాడు. ఢిల్లీలో నలుగురు విదేశీయులను కిడ్నాప్ చేసినందుకు గాను అతను పట్టుబడి జైలు పాలవుతాడు.
ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం (IC-814) హైజాక్ అయినప్పుడు, ప్రయాణికుల ప్రాణాలను కాపాడటం కోసం భారత ప్రభుత్వం ఒమర్ షేక్‌తో పాటు మసూద్ అజహర్‌ను విడుదల చేస్తుంది. జైలు నుండి విడుదలైన తర్వాత ఒమర్ మళ్లీ పాకిస్తాన్ చేరుకుని తన ఉగ్రవాద కార్యకలాపాలను మళ్ళీ కొనసాగిస్తాడు. 2002లో అమెరికన్ జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్‌ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేస్తాడు. అంతే కాకుండా 26/11 ముంబై దాడుల సమయంలో కూడా ఇతని ప్రమేయం ఉన్నట్లు ఈ చిత్రంలో చూపించారు. ఈ సినిమా ఒమర్ షేక్ ఏ విధంగా ఒక రక్తపిపాసిగా మారాడో కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. చివరకు అతను పాకిస్తాన్ అధికారులచే అరెస్టు చేయబడి, జైలు శిక్ష అనుభవిస్తున్నట్లు చూపుతూ కథ ముగుస్తుంది.